అంగుష్టమాత్రులే కావాలట…?
రాయల వంశంలో మహా మంత్రి తిమ్మరుసు ఉండేవారు. ఆయన ఓ విధంగా గీతాచార్యుడు కూడా. అంటే ఒక గీతను పెద్దది చేయాలన్నా చిన్నది చేయాలన్నా కూడా మరో [more]
రాయల వంశంలో మహా మంత్రి తిమ్మరుసు ఉండేవారు. ఆయన ఓ విధంగా గీతాచార్యుడు కూడా. అంటే ఒక గీతను పెద్దది చేయాలన్నా చిన్నది చేయాలన్నా కూడా మరో [more]
రాయల వంశంలో మహా మంత్రి తిమ్మరుసు ఉండేవారు. ఆయన ఓ విధంగా గీతాచార్యుడు కూడా. అంటే ఒక గీతను పెద్దది చేయాలన్నా చిన్నది చేయాలన్నా కూడా మరో గీతని ఆ పక్కన గీస్తే సరి అంటూ రాజనీతి చెప్పాడు. ఇపుడు రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఒకరు మహానేతగా వెలిగిపోవాలంటే మరొకరు అక్కడ చిన్న గీతగా ఉండిపోవాలన్నమాట. అలా కాదు అంటూ సత్తా చాటాలనుకుంటే పై నాయకుడి రాతా గీతా రెండూ మారిపోతాయి. అందుకే రాజకీయాల్లో ఎప్పుడూ రబ్బర్ స్టాంపులు, అంగుష్టమాత్రులకే అందలాలు దక్కుతాయి.
నోరే మైనస్ గా….
చంద్రబాబుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నోరు అతి పెద్ద అండగా అనిపించింది. రాజకీయంగా, వయసు దృష్ట్రా, చాణక్య వ్యూహాలను చూసుకున్నా బాబే అచ్చెన్నాయుడు కంటే సీనియర్ కాబట్టి ఆయనతో పెద్దాయనకు ఏ విధమైన ఇబ్బంది లేదు. అదే చినబాబు ఇపుడిపుడే రాజకీయం మొదలెట్టారు. పైగా మంగళగిరిలో సర్వమంగళం అయిన తరువాత పొలిటికల్ కెరీర్ డిఫెన్స్ లో పడింది. అర్జంట్ గా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలనుకుంటూనే ఏడాదిన్నర కాలం గడిపేశారు. ఇపుడు ఆయన ఏపీ టీడీపీకి భావి వారసుడు, చైతన్య రధ సారధి. మరి ఆయన పక్కన అచ్చెన్న లాంటి వారిని పెడితే ఆ బరువూ, పరువుని తట్టుకోవడం లోకేష్ బాబు చేతనవుతుందా అన్నదే పెద్ద డౌట్.
మెరవాలంటే అలా…?
లోకేష్ అందరిలోనూ అత్యుత్తమంగా మెరవాలంటే అచ్చెన్నాయుడు లాంటి బిగ్ ఫిగర్ ఉంటే సాధ్యపడదుగా. అదే కాస్తా లోప్రొఫైల్ ఉన్న నేతలను ముందు పెడితే అపుడు నారా వారబ్బాయిలో అన్ని కళలూ పండుతాయి. పున్నమి చంద్రుడిగా ఆయనొక్కడే మిలమిలలాడుతూంటారు. బాబు ఏం చెప్పిన శభాష్ అని కనీసం తమ్ముళ్ళ వరకైనా అంటారు. అందుకే చిత్తూరు జిల్లా వాసులు అయిన నారా ఫ్యామిలీ తిమ్మరుసుని ఈ విషయంలో తమ గుగ్గురువుగా భావించి చిన్న గీత పెద్ద గీత రాజకీయాలకు తెర తీస్తున్నారట.
పెదవి దాటిన పన్ను ….
నాయకులకు తెలివి ఉండాలి కానీ అతి తెలివి ఉండరాదు, ఇది రాజనీతి మరి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఇంగ్లీష్ సామెత ఉంది. అలా పార్టీలో నాయకుడు అన్నాక అతను నందిని పంది అన్నా రైటే అనాలి. అలా కాదు అంటే ఇంక నాయకుడి పరువేంకావాలి. ఇలా టీడీపీలో ఆలోచనలు సాగుతున్నాయిపుడు. అంటే అర్జంటుగా అంగుష్టమాత్రులే ఆ పార్టీకి కావాలన్నమాట. వారితోనే పసుపు రధం కదలాలి అన్న మాట. ఇదంతా బాగానే ఉంది కానీ అందరూ సుందోపసుందులైతే ఇక టీడీపీ ప్రభ ఎలా వెలుగుతుంది. జనాలకు ఎలా పార్టీ చేరుతుంది. ఇదెవరైనా ఆలోచించారా. అంటే అన్ని రకాలుగా ఆలోచన చేస్తే జూనియర్ ఎన్టీయార్ ఎందుకు పార్టీకి దూరం అవుతాడు, ముందు పార్టీ నాయకత్వమే ముఖ్యం. ఆ మీదటనే అధికారమైనా పదవులు అయినా. అలా అన్న గారి పార్టీని నారా వారి సొత్తుగా మార్చుకోవడంపైన పెడుతున్న శ్రద్ధ, పన్నుతున్న వ్యూహాలతో టీడీపీ చిద్రమైనా బేఖాతర్. అన్నగారి ఫ్యాన్స్ ఎవరైనా బాధపడినా కూడా జరిగేది ఇదే మరి.