లోకేష్ కు పెరుగుతున్న గ్రాఫ్… అందుకే?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కరోనాకు ముందు… తర్వాత.. రాజకీయ నాయకుడిగా ఆయన పరిణితి సాధించిన విషయం [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కరోనాకు ముందు… తర్వాత.. రాజకీయ నాయకుడిగా ఆయన పరిణితి సాధించిన విషయం [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కరోనాకు ముందు… తర్వాత.. రాజకీయ నాయకుడిగా ఆయన పరిణితి సాధించిన విషయం పెద్దగా నేతలు చర్చించుకుంటున్నారు. కరోనా సమయంలో ట్విట్టర్ ద్వారా నిరంతరం పార్టీని నడిపించేందుకు చేసిన ప్రయత్నాలను కొనియాడుతున్నారు. అదే సమయంలో కరోనా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించిన తీరునుకూడా ప్రశంసిస్తున్నారు. కరోనా సమయంలో ఏపీకి రాకుండా ఎక్కువుగా సోషల్ మీడియాను వినియోగించుకుని.. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు.. ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలోనూ నారా లోకేష్ చురుకైన పాత్ర పోషించారని అంటున్నారు.
సభా వ్యవహారాలపై…..
ఇక, మండలిలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రజావ్యతిరేక బిల్లులను నిలువరించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరును కూడా ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు యనమల వంటివారు మాత్రమే మండలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. ఇప్పుడు నారా లోకేష్ కూడా పట్టుసాధించారని, సభా వ్యవహారాల పైనా ఆయన పట్టు పెంచుకుంటున్నారని పార్టీ నేతలు చర్చించు కుంటున్నారు. సభలో ఎలా వ్యవహరించాలో.. కూడా లోకేష్ పరిణితి సాధించారని చెబుతున్నారు. ప్రజల్లో నిరంతరం ఉండేలా కూడా కార్యక్రమాలు రూపొందించుకుని ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తు తీరుకు సొంత పార్టీ నేతల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఇప్పుడు భరోసా….
నారా లోకేష్ సొంత పార్టీ నేతల నుంచి ఈ పాటి ప్రశంసలు కూడా ఎప్పుడూ రాలేదు. అందుకే ఇప్పుడు ప్రశంసలు కాస్త హైలెట్టే అవుతున్నాయి. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌కే పరిమితం అయిన లోకేష్ ఏపీకి రాకపోవడంతో ప్రతిపక్షాలు, ప్రజలు, చివరకు సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు మునిగినప్పుడు తాజాగా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించడంతో పాటు ఏలూరు సంఘటన వెంటనే స్పందించి అక్కడకు చేరుకుని బాధితులను పరామర్శించడంతో నారా లోకేష్ వార్తల్లోనూ, ప్రజల్లోనూ బాగా నానాడు.
చిన్న సమస్యలను అధిగమిస్తే…..
అయితే, అదే సమయంలో ప్రజలను మరింతగా ఆకర్షించేందుకు తన వాక్చాతుర్యాన్ని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్లు సూచిస్తున్నారు. ఏదో బట్టీ పట్టినట్టు మాట్లాడడం కాకుండా మరింత మెరుగ్గా పంచ్ డైలాగులతో ఆకట్టుకునేలా కూడా నారా లోకేష్ మాట తీరును మెరుగు పరుచుకోవాలని చెబుతున్నారు. అదేసమయంలో చంద్రబాబుస్థానాన్ని భర్తీ చేసేలా నారా లోకేష్ వ్యవహార శైలి ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు వెళ్తున్న తీరు బాగుందని కొనియాడుతున్నారు. చిన్నచిన్న లోపాలను సరిచేసుకుంటే.. వచ్చే మూడేళ్లలో మరింతగా లోకేష్ ప్రజాదరణ సాధించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ సూచనలను లోకేష్ ఎంత వరకు పాటించి మరింత మెరుగైన నాయకుడు అవుతారో ? చూడాలి.