లోకేష్ మరో సారి పార్టీని దెబ్బతీస్తారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మరోసారి తనయుడు లోకేష్ ఇబ్బందిగా మారతారా? లోకేష్ వల్లనే పార్టీ తిరిగి ఇబ్బందుల్లో పడుతుందా? ఇది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మరోసారి తనయుడు లోకేష్ ఇబ్బందిగా మారతారా? లోకేష్ వల్లనే పార్టీ తిరిగి ఇబ్బందుల్లో పడుతుందా? ఇది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మరోసారి తనయుడు లోకేష్ ఇబ్బందిగా మారతారా? లోకేష్ వల్లనే పార్టీ తిరిగి ఇబ్బందుల్లో పడుతుందా? ఇది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. ఎన్నికలు ఇప్పుడప్పుడే లేవు. జమిలి ఎన్నికలు వచ్చినా రెండేళ్ల సమయం ఉంది. చంద్రబాబు ఇప్పుడే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. పార్టీలో ఉత్తేజం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఇదే చివరి ఛాన్స్ అని ప్రజలను కోరే అవకాశం ఉంది.
మరోసారి అధికారంలోకి….
కానీ చంద్రబాబు అధికారంలోకి రావడానికి లోకేష్ అడ్డంకిగా మారనున్నారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతుంది. అందుకే లోకేష్ ను నాయకుడిగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజల్లో నిత్యం ఉండాలని దిశానిర్దేశం చేశారు. దీంతో లోకేష్ కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు.
బాబు అంటే కొంత నమ్మకం….
అయితే చంద్రబాబు అంటే ప్రజల్లో కొంత నమ్మకం ఉంది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్న నమ్మకం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళతారని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. చంద్రబాబు విజన్ పట్ల అపారమైన విశ్వాసం ఉన్న వారు ఇప్పటికీ అనేక మంది ఉన్నారు. వయసురీత్యా, అనుభవం దృష్ట్యా చంద్రబాబు అయితే ఏపీకి మంచి జరుగుతుందని భావించే మేధావి, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. అయితే టీడీపీ గెలిచినా చంద్రబాబు ఏడాదికి మించి ముఖ్యమంత్రిగా ఉండరన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అనుకూల మీడియాలోనూ లోకేష్ ను భావినాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభ మయింది.
సోషల్ మీడియాలో ప్రచారం….
ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు లోకేష్ కు పార్టీ బాధ్యతలను దాదాపుగా అప్పగించారు. తన వయసు రీత్యా కూడా ఆయనకు విశ్రాంతి అవసరం. ఇక లోకేష్ విషయంలో కుటుంబ సభ్యుల వత్తిడి ఎటూ ఉంటుంది. మరోసారి టీడీపీ విజయం సాధించినా ఏపీకి లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది బలంగా ప్రజల్లోకి వెళితే టీడీపీకి మరోసారి గట్టి దెబ్బతగులుతుందంటున్నారు. లోకేష్ కు రాజకీయ అనుభవం తో పాటు అవగాహన లేకపోవడంతో ఆయన పట్ల ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉండదు. మరి ఈ ప్రచారం నుంచి చంద్రబాబు బయటపడితేనే తాను అనుకున్న గోల్ ను సాధించగలుగుతారంటున్నారు సీనియర్ నేతలు.