“నారా”యణ ఇక ఆ వైపు వెళ్లరట
మాజీ మంత్రి నారాయణ విపత్తు సమయంలోనూ కన్పించడం లేదు. మంత్రిగా నారాయణ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు, చినబాబు తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ [more]
మాజీ మంత్రి నారాయణ విపత్తు సమయంలోనూ కన్పించడం లేదు. మంత్రిగా నారాయణ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు, చినబాబు తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ [more]
మాజీ మంత్రి నారాయణ విపత్తు సమయంలోనూ కన్పించడం లేదు. మంత్రిగా నారాయణ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు, చినబాబు తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నారాయణ హవాయే నడిచింది. ఐదేళ్లు ఆయన తిరుగులేకుండా రాజకీయాలు నడిపారు. కీలకమైన మున్సిపల్ శాఖతో పాటు సీఆర్డీఏ ను కూడా చంద్రబాబుకు నమ్మకమైన నారాయణకే అప్పగించారు.
పోటీకి గ్రీన్ సిగ్నల్….
ఇక నారాయణ ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి కావడంతో 2014 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని నెల్లూరు సిటీపై దృష్టి పెట్టారు. దీంతో పాటు అప్పట్లో ఎంపీ అభ్యర్థిగా భావించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నారాయణను నెల్లూరు నుంచి పోటీ చేయించకపోతే పార్లమెంటు ఫలితంపై ప్రభావం పడుతుందని చెప్పడంతో చంద్రబాబు కూడా నారాయణకు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నారాయణ నెల్లూరు సిటీని ఎంచుకున్నారు.
మూడేళ్ల కృషికి….
మూడేళ్ల పాటు నెల్లూరు నగరం అభివృద్ధిపైనే మంత్రిగా నారాయణ దృష్టి పెట్టారు. అయినా చివరకు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత నారాయణ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కన్పించడం లేదు. తన వ్యాపారాలకు మాత్రమే నారాయణ పరిమితమయ్యారు. ఎక్కువగా నారాయణ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లా కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఇక ఇప్పుడు జిల్లాలో 48 వరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విపత్తు సమయంలోనూ…..
నారాయణ నెల్లూరు నుంచే విద్యాసంస్థల అధిపతిగా ఎదిగారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది కూడా నెల్లూరు నుంచే. నెల్లూరులో వైద్య కళాశాలను కూడా నారాయణ ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాను పుట్టి పెరిగిన నెల్లూరుకు మాత్రం విపత్తు సమయంలో నారాయణ ఏం చేయడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తాను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేకపోవడం వల్లనే నారాయణ ఈ కష్టకాలంలోనూ బయటకు రావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మంత్రిగా ఐదేళ్లు ఆధిపత్యాన్ని చెలాయించిన నారాయణ తన నియోజకవర్గానికి కూడా కష్టసమయంలో ఏమీ చేయకపోవడంపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలే పెదవి విరుస్తుండటం విశేషం.