నారాయణ ఇక రారట.. పిలిచినా పోరట
మాజీ మంత్రి నారాయణ కన్పించడమే మానేశారు. ఆయన వ్యాపారసంస్థల మీదకూడా రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టండంతో నారాయణ రాజకీయాలకు దూరమయినట్టే కన్పిస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి [more]
మాజీ మంత్రి నారాయణ కన్పించడమే మానేశారు. ఆయన వ్యాపారసంస్థల మీదకూడా రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టండంతో నారాయణ రాజకీయాలకు దూరమయినట్టే కన్పిస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి [more]
మాజీ మంత్రి నారాయణ కన్పించడమే మానేశారు. ఆయన వ్యాపారసంస్థల మీదకూడా రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టండంతో నారాయణ రాజకీయాలకు దూరమయినట్టే కన్పిస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణను ఎమ్మెల్సీ చేసి మరీ చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కేబినెట్ లో కీలకమైన మున్సిపల్ శాఖ, సీఆర్డీఏ బాధ్యతలను నారాయణ నిర్వహించారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావించిన అమరావతి రూపకల్పనలో నారాయణ చురుకైన పాత్ర పోషించారు.
నెల్లూరు నుంచి పోటీ చేసి….
అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన నారాయణ తన ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారాయణ కొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో నారాయణ విద్యాసంస్థలున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలను ప్రభుత్వాలు మూయించి వేస్తున్నాయి. నిబంధనలు పాటించడం లేదన్న కారణంతోనే నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేస్తున్నారు.
వరస దాడులు..కేసులతో…
విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభం కానుండంటంతో నారాయణకు ఇది ఆందోళన కల్గించే విషయమే. దీంతో పాటు రాజధాని భూముల వ్యవహారంపై నారాయణపై ఇప్పటికే సిట్ కేసు నమోదు చేసింది. ఒక దళితుడిని మోసం చేశారన్న కేసులో నారాయణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకే గత కొంతకాలంగా నారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు.
బీజేపీలోకి వెళ్లాలనుకున్నా…..
నారాయణ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. నారాయణ తొలుత బీజేపీలోకి వెళ్లాలని భావించారు. కానీ చంద్రబాబు సూచన మేరకు ఆగారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అంతా తామే అయి చక్రం తిప్పిన నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలలో సోమిరెడ్డి ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని నారాయణ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద నారాయణ ఒకదఫా మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో రాజకీయ వైరాగ్యాన్ని కొనితెచ్చుకున్నారు.