నారాయణ అలా కోరడం వల్లనే బాబు?
మాజీ మంత్రి నారాయణ టీడీపీకి పూర్తిగా దూరమయినట్లే కన్పిస్తుంది. ఆయన కొద్ది నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా నారాయణను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాల [more]
మాజీ మంత్రి నారాయణ టీడీపీకి పూర్తిగా దూరమయినట్లే కన్పిస్తుంది. ఆయన కొద్ది నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా నారాయణను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాల [more]
మాజీ మంత్రి నారాయణ టీడీపీకి పూర్తిగా దూరమయినట్లే కన్పిస్తుంది. ఆయన కొద్ది నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా నారాయణను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాలని భావించి నారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయంగా తనకు లాభం ఏదీ లేకపోయినా, వ్యాపార పరంగా ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని నారాయణ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
వెనక నుంచే……
2014లోనే నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి వరకూ నారాయణ టీడీపీకి వెనక ఉండి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. తొలినుంచి నారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా నారాయణ ఏనాడూ రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు. అయితే పదేళ్ల పాటు టీడీపీ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు నారాయణ చంద్రబాబుకు అన్ని రకాలుగా అండదండలుగా నిలిచారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత….
అందుకు చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణను స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆయన సేవలు పార్టీకి నేరుగా అవసరమనిచెప్పారు. ఎమ్మెల్సీని చేసి మంత్రిని కూడా చేశారు. కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిని చేశారు. ఐదేళ్ల పాటు నారాయణ హవా టీడీపీ ప్రభుత్వంలో మామూలుగా లేదు. కానీ 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారాయణ టార్గెట్ అయ్యారు. వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆయన విద్యాసంస్థలకే పరిమితమయ్యారు.
గంటా ఎఫెక్ట్…..
దీనికి తోడు తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావును కూడా టీడీపీ పక్కన పెట్టింది. ఆయన టీడీపీకి దూరంగా ఉండటం కూడా నారాయణను ఒకవిధంగా పార్టీకి ఎడం పెంచిందంటున్నారు. నారాయణ స్వయంగా చంద్రబాబును కలసి తన బాధను వివరించుకున్నట్లు తెలిసింది. అందుకే నారాయణకు చంద్రబాబు పార్టీలో ఏ పదవులు ఇవ్వలేదు. నెల్లూరు జిల్లాలో నారాయణకు కొంత పట్టున్నా ఆయనను పక్కన పెట్టారు. నారాయణ ఒక టర్మ్ తోనే రాజకీయానికి ముగింపు పలకాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.