సెకండ్ టర్మ్ లో.. సెకండ్ వేవ్ లో…?
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని మోదీ ప్రభుత్వం పసిగట్టలేకపోయింది. ఇంత తీవ్రతను ఊహించలేకపోయింది. కరోనాను జయించామని ఆర్భాటపు ప్రకటనలు తప్ప భవిష్యత్ లో తలెత్తనున్న పెనుముప్పును గ్రహించలేకపోయింది. [more]
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని మోదీ ప్రభుత్వం పసిగట్టలేకపోయింది. ఇంత తీవ్రతను ఊహించలేకపోయింది. కరోనాను జయించామని ఆర్భాటపు ప్రకటనలు తప్ప భవిష్యత్ లో తలెత్తనున్న పెనుముప్పును గ్రహించలేకపోయింది. [more]
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని మోదీ ప్రభుత్వం పసిగట్టలేకపోయింది. ఇంత తీవ్రతను ఊహించలేకపోయింది. కరోనాను జయించామని ఆర్భాటపు ప్రకటనలు తప్ప భవిష్యత్ లో తలెత్తనున్న పెనుముప్పును గ్రహించలేకపోయింది. ఆ తప్పిదమే ఇప్పుడు దేశం అనుభవిస్తుంది. రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళన పెంచుతుంది. ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
తొలిదశలో ప్రశంసలు…
కరోనా తొలి దశ వచ్చినప్పుడు లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా విధించారు. అప్పుడు కోట్లాది మంది ఉపాధి లేక ఇబ్బందులు పడినా ప్రాణాలు నిలబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వారికోసం కొన్ని ప్యాకేజీలను ప్రకటించింది. ఇది ఎంత ఊరట అందించిందన్నది పక్కన పెడితే తొలిదశలో కరోనా వచ్చిన సమయంలో మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనేక మార్లు అభినందించింది.
పూర్తిగా చేతులెత్తేసి…
కానీ సెకండ్ వేవ్ లో మాత్రం మోదీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. భారత్ లో వ్యాక్సిన్ తయారవుతున్నా ఇతర దేశాలకు పంపిణీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భారత ప్రజలకు ఖరీదు కట్టి వ్యాక్సిన్ అందిస్తూ కొన్ని దేశాలకు ఉచితంగా పంపిణీ చేయడంపైన కూడా అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఆక్సిజన్ కొరతపై కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇక తొలి విడతలో వచ్చిన అనుభవాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. బెడ్ల సంఖ్యను పెంచలేదు.
నిధులు మూలుగుతున్నా…?
ఇక తొలిదశలో అనేక మంతి కరోనాపై యుద్ధం కోసం విరాళాలు ప్రకటించాయి. దాదాపు 35 వేల కోట్లు నిధులు మూలుగుతున్నాయి. అలాగే పీఎం కేర్స్ లో కూడా మరో పదివేల కోట్లున్నాయి. కానీ వీటిని సెకండ్ వేవ్ లో ఖర్చుపెట్టేందుకు మోదీ మనసు ఒప్పుకోవడం లేదులా ఉంది. 161 ఆక్సిజన్ తయారీసంస్థలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 33 సంస్థలకే అనుమతివ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. సెకండ్ టర్మ్ లో సెకండ్ వేవ్ లో మోదీ ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయారనే చెప్పాల్సి ఉంటుంది.
- Tags
- modi
- à°®à±à°¦à±