మోదీ మొదలుపెట్టారు.. ఉండేదెవరు? ఊడేదెవరు?
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోదీ రెడీ అయిపోయారు. కొత్త టీంతో క్లిష్ట సమయంలో పాలన సాగించాలని మోదీ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా మోదీ తన మంత్రివర్గాన్ని [more]
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోదీ రెడీ అయిపోయారు. కొత్త టీంతో క్లిష్ట సమయంలో పాలన సాగించాలని మోదీ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా మోదీ తన మంత్రివర్గాన్ని [more]
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోదీ రెడీ అయిపోయారు. కొత్త టీంతో క్లిష్ట సమయంలో పాలన సాగించాలని మోదీ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మోదీ కేబినెట్ కూర్పుపై కసరత్తులు చేస్తున్నారు. కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు, మరికొందరి శాఖల్లో మార్పులు చేయనున్నట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కరోనా రాకపోయి ఉంటే….?
నిజానికి కరోనా వైరస్ రాకపోయి ఉంటే ఈ పాటికి కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగి ఉండేది. కాని కరోనా ప్రభావంతో గత మూడు నెలల నుంచి మంత్రి వర్గ విస్తరణ గురించి ఆలోచించలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన భారత్ ను గట్టెక్కించడానికి నిపుణులను కేబినెట్ లోకి తీసుకోవాలని మోడీ నిర్ణయించుకున్నారు.
సింధియాకు ఛాన్స్….
మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా రావడంతోనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సింధియాకు కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని బీజేపీ అగ్రనాయకత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో సింధియా బీజేపీలో చేరారు. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో జ్యోతిరాదిత్య సింధియాకు ఖచ్చితంగా స్థానం ఉంటుందని చెప్పారు. అలాగే ఎన్నికలు జరగబోయే బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
నిర్మలమ్మ శాఖ మార్పు?
మరోవైపు దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను మోదీ మార్చాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇది భవిష్యత్ పై మరింత ఆందోళన కల్గిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ కు వేరే శాఖకు బదిలీ చేసి, ఆమె స్థానంలో సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ ను నియమించాలని మోదీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద భారీ స్థాయిలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండనున్నాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీ ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాక మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముంది.
- Tags
- modi
- à°®à±à°¦à±