మోడీ జమిలి వ్యూహం.. కాంగ్రెస్‌కు భయపడుతున్నారా..?
బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో మరోసారి జమిలి ఎన్నికలను తెరమీదికి తెచ్చారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ నినాదంతో ఆయన అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారు. [more]
బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో మరోసారి జమిలి ఎన్నికలను తెరమీదికి తెచ్చారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ నినాదంతో ఆయన అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారు. [more]
బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో మరోసారి జమిలి ఎన్నికలను తెరమీదికి తెచ్చారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ నినాదంతో ఆయన అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారు. ఇప్పటికే పౌరసత్వ చట్టంలో మార్పులు చేశారు. జమ్ము కాశ్మీర్లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి.. ఇప్పటి వరకు దేశంలోని అన్ని ప్రాంతాలు.. ఒకటిగా.. జమ్ము కశ్మీర్ ఒక్కటి ఒకటిగా ఉన్న విధానానికి తెరదించారు. అదే సమయంలో ట్రిపుల తలాక్‌ను రద్దు చేయడంతోపాటు.. సాధారణ ఇతర వర్గాల మహిళలకు ఉన్న వివాహ హక్కులనే ముస్లిం మహిళలకు వర్తించేలా చట్టాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిపించాలనేది మోడీ వ్యూహం. అందుకే ఆయన దీనిపై ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు.
అంతా సిద్ధమయినట్లేనా…?
అయితే.. జమిలి ఇప్పుడే వచ్చిన నినాదం కాదు.. గతంలో అంటే.. మోడీ తొలి ఐదేళ్ల పాలన ముగియకముందుగానే జమిలి నినాదం జోరుగా వినిపించింది. 2017-18 కూడా జమిలి కోసం మోడీ ప్రయత్నాలు చేశారు. అయితే.. అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్.. సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో అది మూలన పడింది. ఇక, ఇప్పుడు మరోసారి జమిలి అంటూ.. ప్రధాని ప్రకటన చేయడం.. ఆ వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా సై! అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. జమిలికి రంగం సిద్ధం అవుతోంది. లా కమిషన్ ద్వారా.. రాజ్యాంగపరంగా చేయాల్సిన మార్పు,చేర్పుల గురించి ఇప్పటికే మోడీ నివేదిక తెప్పించుకున్నారని సమచారం. ఇక, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా అన్ని పార్టీల అభిప్రాయాలనూ తెలుసుకున్నారు.
కాంగ్రెస్ కు భయపడేనా?
దీంతో ఈసారి జమిలి ఎన్నికలు ఖాయమేనని అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. అయితే.. మోడీ పైకి చెబుతున్నట్టు ఒక దేశం.. ఒకే సారి ఎన్నికలు అనే విషయం వెనుక కేవలం.. ఎన్నికల ఖర్చును తగ్గించుకోవడం, ప్రక్రియను సాగదీయకుండా.. నెలల తరబడి ప్రభుత్వ యంత్రాంగాలు ప్యారలైజ్డ్ కాకుండా చూడడమే ఉందా ? లేక ఇంకా ఏమైనా ఉందా ? అంటే.. కీలకమైన కాంగ్రెస్ పార్టీ భయం ఆయనను వెంటాడుతోందని చెబుతున్న వారు, అదే సమయంలో తన సర్కారుపై కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోందన్న విషయం మోడీ ఇప్పటికే గ్రహించారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో నిరుద్యోగం అదేవిధంగా ఉంది. ఆయన విధానాలతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు. పైగా నిత్యావరస ధరలు ఆకాశానికి అంటాయి.
వ్యతిరేకత మరింత పెరుగుతుందని…..
పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మోడీపై సహజంగానే వ్యతిరేకత ఉంది. ఇది అంతిమంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మోడీ వ్యూహాత్మకంగా జమిలి తీసుకువచ్చారని మేధావులు భావిస్తున్నారు. ఇప్పుడు జమిలి నిర్వహించినా.. అన్ని రాష్ట్రాల్లోలనూ ఒకే తరహా పరిస్థితి ఉండదు. కొన్ని చోట్ల ప్రభుత్వాలు మధ్యలో కూలిపోయినా.. లేక ప్రభుత్వాలు బర్తరఫ్ అయినా.. పరిస్థితి ఏంటి? అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. విశాలమైన మన దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ భిన్నత్వం నేపథ్యంలో జమిలి సాధ్యం కాదని అంటున్నారు. మరి మోడీ ఏం చేస్తారో చూడాలి.
- Tags
- modi
- à°®à±à°¡à±