మోదీ ముందుంది… అప్పుడు తెలుస్తుంది
మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. రానున్న కాలంలో జరగబోయే ఎన్నికలపై ఈ నిర్ణయాల ప్రభావం ఉంటుందంటున్నారు. ఇక వరసగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు [more]
మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. రానున్న కాలంలో జరగబోయే ఎన్నికలపై ఈ నిర్ణయాల ప్రభావం ఉంటుందంటున్నారు. ఇక వరసగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు [more]
మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. రానున్న కాలంలో జరగబోయే ఎన్నికలపై ఈ నిర్ణయాల ప్రభావం ఉంటుందంటున్నారు. ఇక వరసగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ వంటి రాష్ట్రాల శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయంటున్నారు.
మోదీ నిర్ణయాలతో……
అసలే కరోనా తో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఆర్థికంగా ఇబ్బందులుండటంతో జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించడంపై కూడా మోదీ ప్రభుత్వం పిల్లిమొగ్లలు వేస్తోంది. దీంతో మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలయింది. తమకు మద్దతిస్తున్న పార్టీలే మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోదీ మొండిగానే ముందుకు పోయేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఉంటుందంటున్నారు.
వ్యవసాయ సంస్కరణలపై……
ప్రధానంగా మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న వ్యవసాయ సంస్కరణల బిల్లులను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీఏలో భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం నుంచి తప్పుకుందంటే ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ సంస్కరణ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిపై ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
బీహార్ ఎన్నికల్లో…..
బీహార్ ఎన్నికలు ఎంతో దూరం లేవు. మరికొద్ది నెలల్లోనే జరగబోతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ బిల్లుల గొడవ నితీష్ కుమార్ కు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల వేళ ఇలాంటి బిల్లులను తేవడం అంతర్గతంగా ఆయన కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరినీ లెక్క చేయని మోదీ తాను అనుకున్నట్లుగానే వెళుతున్నారు. రేపటి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితే దానికి ప్రధాన కారణం మోదీయే అని అనక తప్పదని ఎన్డీఏలోని మిత్రపక్షాలు సయితం వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
- Tags
- modi
- à°®à±à°¦à±