వన్ నేషన్ .. వన్ రేషన్ ఒకే … కానీ …?
దేశంలో జాతీయ పార్టీకి మనుగడ సాగించాలంటే ముఖ్యంగా దేశంలో జాతీయ భావాలు ప్రోదికొల్పాలి. గత ఆరేళ్లుగా నరేంద్ర మోడీ సారధ్యంలో కాషాయదళం ఇదే ప్రయత్నంలో దూసుకుపోతుంది. కాశ్మీర్ [more]
దేశంలో జాతీయ పార్టీకి మనుగడ సాగించాలంటే ముఖ్యంగా దేశంలో జాతీయ భావాలు ప్రోదికొల్పాలి. గత ఆరేళ్లుగా నరేంద్ర మోడీ సారధ్యంలో కాషాయదళం ఇదే ప్రయత్నంలో దూసుకుపోతుంది. కాశ్మీర్ [more]
దేశంలో జాతీయ పార్టీకి మనుగడ సాగించాలంటే ముఖ్యంగా దేశంలో జాతీయ భావాలు ప్రోదికొల్పాలి. గత ఆరేళ్లుగా నరేంద్ర మోడీ సారధ్యంలో కాషాయదళం ఇదే ప్రయత్నంలో దూసుకుపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తూర్పు నుంచి పశ్చిమ వరకు దేశం నలుచెరగులా బిజెపి జండా రెపరెపలాడించాలన్నది కమలం దీర్ఘకాలిక వ్యూహం. ముఖ్యంగా దక్షిణాదిలో కర్ణాటక తప్ప మరెక్కడా బిజెపి ఉనికి ఉందా లేదా అన్నట్లు సాగుతుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, అనే నినాదంతో పాటు ఈ మధ్య కాలంలో అనేక కీలక అంశాలను జాతీయ భావాన్ని పెంచేందుకు వ్యూహాత్మకంగా అమల్లో పెడుతుంది కమలం.
కాశ్మీర్ తో ముందడుగు …
కాశ్మీర్ పై బిజెపి వేసిన అడుగులపై భిన్నాభిప్రాయాలు ఉన్నా మెజారిటీ దేశవాసులు నరేంద్ర మోడీ నిర్ణయాన్నే సమర్ధించారు. కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అన్న సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అయిపొయింది. ఇప్పుడు వన్ నేషన్, వన్ రేషన్ నినాదం కూడా బిజెపి కి కలిసొచ్చేలాగే ఉంది. కరోనా సమయంలో దేశంలో వలసకూలీలు వివిధ రాష్ట్రాల్లో ఉండటంతో రేషన్ కోసం ఇతర ప్రభుత్వ ఫలాల కోసం సొంత ఊర్ల బాట పట్టారు.
కరోనా సమయంలో రేషన్ …
ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే రేషన్ కార్డు ఉండేలా అది ఏ రాష్ట్రంలో అయినా పనికొచ్చేలా విధానం తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కరోనా సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నా వారు డిజిటల్ వేలిముద్ర వేసుకుని రేషన్ తీసుకునే సౌకర్యాన్ని అమల్లో పెట్టి ప్రశంసలు అందుకున్నాయి. పెన్షన్లు కరోనా సాయం కోసం ప్రకటించిన నగదును సైతం ఆయా రాష్ట్రాలు బట్వాడా ఇలాగే చేసేశాయి. ఇది గుర్తెరిగి ఈ విధానం దేశం మొత్తం అమలు చేసి పేదలకు కేంద్రం అమలు చేస్తుంది ఫలానా ది అని చెప్పేందుకు మోడీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తప్పకుండా వన్ రేషన్ నరేంద్ర మోడీ అంచనాలకు తగినట్లే క్లిక్ అవుతుందంటున్నారు విశ్లేషకులు.