మరో దారి లేదా….?
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటు పార్టీలోనూ, అటు మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి ఉందన్న ప్రచారం బాగానే ఉంది. ముఖ్యంగా హస్తినలో లోక్ సభ ఎన్నికల వేళ ఈ [more]
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటు పార్టీలోనూ, అటు మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి ఉందన్న ప్రచారం బాగానే ఉంది. ముఖ్యంగా హస్తినలో లోక్ సభ ఎన్నికల వేళ ఈ [more]
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటు పార్టీలోనూ, అటు మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి ఉందన్న ప్రచారం బాగానే ఉంది. ముఖ్యంగా హస్తినలో లోక్ సభ ఎన్నికల వేళ ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదన్న అంచనాలు ఉన్నాయి. వివిధ సర్వేల సంస్థలు కూడా అదే చెబుతున్నాయి. అయితే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించనుందని మాత్రం స్పష్టం చేస్తున్నాయి.
ప్రచారం జోరుగా…
ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు మిత్రపక్షాలు సయితం సుముఖంగా లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 200 లోపు స్థానాలు వస్తే భారతీయ జనతాపార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్ వంటి పేర్లు బాగానే విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ నుంచి కొన్ని మిత్రపక్షాలు తప్పుకున్నాయి. ప్రధానంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది.
తొలి నుంచి శివసేన….
ఇక మరోమిత్రపక్షమైన శివసేన సయితం మోదీ, అమిత్ షా తీరుపట్ల గుర్రుగా ఉంది. గత ఐదేళ్లుగా మోదీ అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు తన అధికార పత్రిక సామ్నాలో ఉతికి ఆరేస్తూనే ఉంది. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలపై శివసేన విభేదించింది. భారతీయ జనతా పార్టీని కాకుండా మోదీ, అమిత్ షాలపైనే శివసేన మండిపడేది. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు కలిశాయి. పొత్తుతో మహారాష్ట్రలో పోటీ చేస్తున్నాయి.
టోన్ మార్చి…..
అయితే ఎన్నికల వేళ మోదీకి అండగా నిలవాలని శివసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. తనకు శత్రువుగా మారిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ థాక్రే కాంగ్రెస్ కూటమికి అండగా నిలవడంతో శివసేనకు మరో దారి లేకుండా పోయిందంటున్నారు. అందుకే ఈసారి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటన్ని స్థానాలను గెలుచుకోకపోయినా, ఎన్డీఏలోని పార్టీల అండతో మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అనడం గమనార్హం. మోదీకి శివసేన అండగా నిలుస్తుందనడానికి ఆయన వ్యాఖ్యలే ఉదాహరణ. అంటే మరోసారి ప్రధానిగా మోదీ అయ్యేందుకు మిత్రపక్షాల్లోని ప్రధాన పార్టీ శివసేన అభ్యంతరాన్ని వ్యక్తం చేయకపోవడం విశేషం. ఇది మోదీతో పాటు బీజేపీకి సానుకూలమైన అంశమే.
- Tags
- amith shah
- bharathiya janatha party
- indian national congress
- maharashtra
- narendra modi
- rahul gandhi
- shivasena
- telugudesamparty
- udhav thakre
- ఠమితౠషా
- à°à°¦à±à°¦à°µà± థాà°à±à°°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నరà±à°à°¦à±à°°à°®à±à°¦à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- మహారాషà±à°à±à°°
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- శివసà±à°¨