మరోసారి లాక్ డౌన్… అనివార్యమా?
దేశంలో మరో సారి లాక్ డౌన్ విధించనున్నారా? కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ [more]
దేశంలో మరో సారి లాక్ డౌన్ విధించనున్నారా? కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ [more]
దేశంలో మరో సారి లాక్ డౌన్ విధించనున్నారా? కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 13 లక్షలు దాటాయి. నలభై వేలకు చేరువలో మరణాలున్నాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. సెప్టంబరు నెల నాటికి కరోనా పాజిటివ్ కేసులు కోటికి చేరుకునే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకు అత్యధిక కేసులు….
ిఇప్పటికే భారత్ లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుండటం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధించుకున్నాయి. రోజుకు యాభై వేల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
నిపుణుల హెచ్చరికలతో…..
అయితే నిపుణుల హెచ్చరికలు, అధ్యయనసంస్థల హెచ్చరికలతో మరోసారి లాక్ డౌన్ ను భారత్ లో విధించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27 వ తేదీన సీఎంలతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయం సేకరించనున్నారు. ఇప్పటికే ఇచ్చిన మినహాయింపులు, కరోనా పరిస్థిితిపై చర్చించనున్నారు.
ఆసుపత్రుల్లో బెడ్ల కొరత…..
మరోసారి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలన్న సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల వద్ద ఉంచనున్నారు. అయితే లాక్ డౌన్ విధిస్తే మళ్లీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశముంది. లాక్ డౌన్ విధించకుండా కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా మోదీ చర్చించనున్నారు. దీంతో పాటు వెంటిలేటర్ల కొరత, ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటు వంటివి వాటిపైనా మోదీ చర్చించనున్నారు.