సక్సెస్ “సీక్రెట్” అదేనా?
ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. నిర్ణయం వెలువడిన తర్వాతనే దేశ ప్రజలతో పాటు సహచరులతో పాటు మిత్రపక్షాలకూ తెలుస్తోంది. పెద్దనోట్ల [more]
ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. నిర్ణయం వెలువడిన తర్వాతనే దేశ ప్రజలతో పాటు సహచరులతో పాటు మిత్రపక్షాలకూ తెలుస్తోంది. పెద్దనోట్ల [more]
ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. నిర్ణయం వెలువడిన తర్వాతనే దేశ ప్రజలతో పాటు సహచరులతో పాటు మిత్రపక్షాలకూ తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు విషయం దగ్గర నుంచి తీసుకుంటే ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయాల్లో గోప్యత పాటిస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది. తాజాగా అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలోనూ ప్రధాని గోప్యత పాటించడంపై మంత్రి వర్గ సహచరులు లోలోన మదనపడుతున్నారు. ఇంతటి కీలక నిర్ణయాన్ని ముందుగా తమతో చెప్పలేదన్న అక్కసుతో ఉన్నారు.
అన్నీ గోప్యంగానే….
మిత్రపక్షాలైన శివసేన దగ్గర నుంచి అందరూ మోదీని అందుకే తరచూ విమర్శిస్తుంటారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయమంటే అది బయటకు చెప్పకూడని విషయమే. చివరకు ఆర్థికమంత్రికి కూడా మోదీ చివరి క్షణం వరకూ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ రిజర్వేషన్ల విషయంలోనూ మోదీ అదే పద్ధతిని పాటించారు. మోదీ గ్రాఫ్ తగ్గుతుందున్న విపక్షాల విమర్శలు, సర్వేల నివేదికల నేపథ్యంలో ఆయన తన అమ్ముల పొదిలో నుంచి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు.
కేబినెట్ నోట్ లోనూ……
మంత్రివర్గ సమావేశం జరిగే ముందు అందరు మంత్రులకు కేబినెట్ నోట్ అందుతుంది. మంత్రివర్గ సమావేశానికి మూడురోజుల ముందే అధికారులు ఈ నోట్ ను తయారు చేశారు. అందులో ఈ ప్రస్తావనే లేదు. మమూలుగా మంత్రివర్గ సమావేశానికి హాజరైన అమాత్యులకు రిజర్వేషన్ల అంశం షాకిచ్చిందనే చెప్పాలి. అయితే ఎన్నికల్లో తమను గట్టిగా ఒడ్డున పడేసే అంశం కావడంతో సొంత పార్టీ నేతలు సయితం అవాక్కయి చూడటం… ఆనందంగా చప్పట్లు కొట్టడం తప్ప ఏమీ చేయలేకపోయారు. మనసులో మాత్రం ఈ గోప్యత ఎందుకన్న చర్చ ఆ పార్టీ నేతల్లో మాత్రం స్పష్టంగా కనపడుతోంది.
విపక్షాలకు మింగుడుపడకపోయినా….
విపక్షాలు సయితం మోదీ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించలేకపోయాయి. ప్రధానంగా కాంగ్రెస్ పరిస్థితి ఈ విషయంలో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. యూపీఏ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల ప్రతిపాదనను గతంలో పరిశీలించింది. 2010లో ఎస్సార్ సిన్హా కమిషన్ దీనిపై నివేదిక కూడా ఇచ్చింది. దాన్నే మోదీ ఇప్పుడు బయటకు తీసి అందరికీ షాకిచ్చారు. అన్ని పార్టీలకూ దీనికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారు. ఎన్నికల వేళ తెస్తున్న ఈ బిల్లు ప్రస్తుతం లోక్ సభ లో ఆమోదం పొందింది. రాజ్యసభలోనూ దాదాపు అంతే మోదీ సక్సెస్ “‘సీక్రెట్” అదేనంటున్నారు ఆయన సహచర మంత్రులు. మొత్తం మీద నరేంద్రమోదీ ఎన్నికల వేళ విపక్షాలకు రిజర్వేషన్ల బిల్లుతో కంటిమీద కునుకులేకుండా చేశారు.
- Tags
- bharathiya janatha party
- india
- indian national congress
- mayavathi
- narendra modi
- rahul gandhi
- reservations
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బహà±à°à°¨à± సమాà°à± పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤ à°¦à±à°¶à°®à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- మాయావతి
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- à°°à°¿à°à°°à±à°µà±à°·à°¨à±à°²à±