ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేసేలా?
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరిలోనూ భిన్నమైన నేత. ఎక్కువ మాట్లాడరు. అలాగని మెతక కాదు. తన చేతల ద్వారా తానేంటో చూపిస్తారు. ఐదు సార్లు ఒడిశా [more]
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరిలోనూ భిన్నమైన నేత. ఎక్కువ మాట్లాడరు. అలాగని మెతక కాదు. తన చేతల ద్వారా తానేంటో చూపిస్తారు. ఐదు సార్లు ఒడిశా [more]
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరిలోనూ భిన్నమైన నేత. ఎక్కువ మాట్లాడరు. అలాగని మెతక కాదు. తన చేతల ద్వారా తానేంటో చూపిస్తారు. ఐదు సార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గెలుస్తున్నారంటే ఆయన విజయరహస్యాలలకు ఎన్నో కారణాలు. ఐదో సారి అధికారంలోకి వచ్చాక నవీన్ పట్నాయక్ వివిధ సంక్షేమ పథకాలతో పాటు అవినీతిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇప్పుడు అధికార వర్గాల్లో అదే కలవరానికి కారణమయింది.
రాష్ట్ర ప్రయోజనాలే….
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ బాధ్యతలను చేపట్టాక ఇక వెనుదిరిగి చూడలేదు. ఆయన ఏ ఎన్నికలోనూ విజయమే తప్ప అపజయం కన్పించలేదు. వెనకబడిన రాష్ట్రమైన ఒడిశాలో ఇరవై ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ కు కుటుంబ బాంధవ్యాలు లేవు. ప్రజా సంక్షేమమే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నవీన్ పట్నాయక్ కేంద్రంతో సఖ్యతగానే ఉంటారు. అవసరమైన సందర్భాల్లో మాత్రం కరకు నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రమాణ స్వీకారం చేసినప్పుడే…..
ఇప్పుడు ఒడిశాలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ప్రజలకు స్పష్టమైన వాగ్దానం చేశారు. అవినీతి రహిత పాలనను అందిస్తానని చెప్పారు. ముఖ్యంగా సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారుల భరతం పడతానని చెప్పారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే సమస్య పరిష్కారం కావాలి. కాసుల కోసం కొర్రీలు వేస్తే కఠిన చర్యలు తప్పవంటూ నవీన్ పట్నాయక్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే చెప్పారు.
అధికారులు ఇంటికే…..
ఇందులో భాగంగా 5 టీ, మో సర్కార్ కార్యక్రమాలను తెచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే కాకుండా అవీనీతి అధికారుల భరతం పట్టడమే. నవీన్ పట్నాయక్ ఐదో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి తొమ్మిది నెలలు కావస్తుంది. ఈ తొమ్మిది నెలల్లో ఒడిశాలో 89 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. కొందరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తే మరికొందరిని బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించి నవీన్ పట్నాయక్ కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టారు. అవినీతి జరిగిదంటూ తేలితే చాలు నేరుగా సీఎం కార్యాలయం స్పందిస్తుంటంతో ఒడిశాలో అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సి వస్తుంది.