సిఎస్ టార్గెట్ అయ్యారే?
కరోనా వ్యాధితో ప్రపంచమంతా భయపడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడంలో ఏ పార్టీ అతీతం కాదన్నది మరోసారి స్పష్టమయింది. నిన్న [more]
కరోనా వ్యాధితో ప్రపంచమంతా భయపడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడంలో ఏ పార్టీ అతీతం కాదన్నది మరోసారి స్పష్టమయింది. నిన్న [more]
కరోనా వ్యాధితో ప్రపంచమంతా భయపడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయాలకు ఏమాత్రం కొదవలేదు. రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడంలో ఏ పార్టీ అతీతం కాదన్నది మరోసారి స్పష్టమయింది. నిన్న మొన్నటి వరకూ వైసీపీని, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు రాజకీయాలను అంటగడుతున్నారు. అంతేకాదు నీలం సాహ్ని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లేఖ రాయడంపై…..
ఇందుకు ప్రధాన కారణం నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాయడమే. మూడు వారాలు ఏపీలో కరోనా ఛాయలు ఉండవని, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, రద్దుపై పునరాలోచించాలని నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు చెప్పింది.
రాజకీయంగా దుమారం….
ఈలోపు కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో ఏపీ ప్రభుత్వం సయితం కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంది. ప్రధానంగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఇందులో ముఖ్య భూమిక పోషిస్తారు. అయితే ఆమెను పదవి నుంచి వైదొలగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాయడం రాజకీయంగా దుమారం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అందరి దృష్టి కరోనా నియంత్రణపైనే ఉంది.
ఇప్పుడూ రాజకీయాలేనా?
ఈ సమయంలో విపక్షాలు నీలం సాహ్ని రాజీనామాకు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి, ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకే నీలం సాహ్ని లేఖ రాసి ఉంటారు. దానిని పట్టుకుని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదన్న కామెంట్లు బలంగా విన్పిస్తున్నాయి. వామపక్ష పార్టీలు ఈ రకమైన డిమాండ్ చేయడాన్ని ఆశ్చర్యం కల్గిస్తుంది. మొత్తం మీద ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కలసి కట్టుగా పనిచేయాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పక తప్పదు.