నెట్టెం విఫలమయ్యారా ? టీడీపీ నేతల అసంతృప్తి
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎక్సైజ్ మంత్రి, పార్టీ సీనియర్ నేత నెట్టెం రఘురాం పరిస్థితి ఏంటి ? ఆయన పార్టీలో [more]
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎక్సైజ్ మంత్రి, పార్టీ సీనియర్ నేత నెట్టెం రఘురాం పరిస్థితి ఏంటి ? ఆయన పార్టీలో [more]
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎక్సైజ్ మంత్రి, పార్టీ సీనియర్ నేత నెట్టెం రఘురాం పరిస్థితి ఏంటి ? ఆయన పార్టీలో శ్రేణులను ముఖ్యమైన నాయకులను ఏమేరకు ప్రభావితం చేయగలుగుతున్నారు ? అనే ప్రశ్నలు తాజాగా మరోసారి తెరమీదకి వచ్చాయి. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఎదురైన పరాభవం నేపథ్యంలో ఆయన వ్యవహరించిన తీరుపై పార్టీలో సీనియర్లు ఒకింత అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలోనే తన సత్తా చూపించేందుకు నెట్టెంకు అవకాశం వచ్చిందని అయితే.. ఆయన ఆశించిన మేరకు స్పందించలేక పోయారని చెబుతున్నారు.
చొరవ చూపించలేక….
దేవినేని ఉమా వర్సెస్ మంత్రి కొడాలి నానిల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ విషయంలో తప్పు ఎవరిదైనా ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆలయాలపై దాడులు, అప్పులు వంటి విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే కొడాలి నాని రెచ్చిపోయారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టి.. దేవినేనిని వారించి.. వివాదం పెద్దది కాకుండా చూసే అవకాశం నెట్టెం రఘురాంకు ఉంది. అదే సమయంలో వివాదం వచ్చిన తర్వాత కూడా కీలకమైన ఎంపీ కేశినేని నాని వంటివారిని రంగంలోకి దింపడంలోనూ నెట్టెం రఘురాం చొరవ చూపించలేక పోయారనే వాదన కూడా వినిపిస్తోంది.
కనీసం స్పందించకపోవడంతో….
దేవినేనిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత స్టేషన్ల చుట్టూ తిప్పారు. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాజీమంత్రిని నిర్బంధించారు. అదే సమయంలో గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల్లో ఎక్కడో ఒకచోట నెట్టెం రఘురాం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే పార్టీ పరిస్థితి ఇలా ఉండేది కాదని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని అంచనా వేసుకుని.. ముందుగానే అలెర్టయి కీలక నేతలకు పని అప్పగించి ఉంటే మరో విధంగా ఉండేదని అంటున్నారు. కానీ, ఏ రూపంలో చూసినా నెట్టెం రఘురాం విఫలమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది.
కీలక పదవి అప్పగించినా…..?
నాయకులు కూడా తమంతట తాముగానే స్పందించారు తప్ప నెట్టెం రఘురాం ఎవరినీ ఐక్య పరిచే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. ఆయనకు కీలకమైన విజయవాడ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు ఏ మాత్రం వ్యూహం లేకుండా నిస్తేజంగా వ్యవహరిస్తోన్నారనే పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఈ పార్లమెంటు పరిధిలో టీడీపీ నేతలు అంతా తలపండిన వారే కావడంతో ఎవ్వరూ నెట్టెంను పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో ఆయన ఏదో అధ్యక్షుడిగా పని చేయడం కంటే యాక్ట్ చేయడంతోనే సరిపెట్టేస్తున్నారు. మొత్తంగా నెట్టెం రఘురాం విఫలమయ్యారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.