గోడ దూకుళ్ళతో వైసీపీలో కొత్త రచ్చ ?
వైసీపీలో ఉన్న నాయకులు దశాబ్దాల కాలం పాటు పనిచేసిన వారు. తమ కాలాన్ని, కరెన్సీని, కండలను సైతం కరిగించేసిన వాళ్ళు. వారు వైసీపీలో చేరినపుడు జగన్ వట్టి [more]
వైసీపీలో ఉన్న నాయకులు దశాబ్దాల కాలం పాటు పనిచేసిన వారు. తమ కాలాన్ని, కరెన్సీని, కండలను సైతం కరిగించేసిన వాళ్ళు. వారు వైసీపీలో చేరినపుడు జగన్ వట్టి [more]
వైసీపీలో ఉన్న నాయకులు దశాబ్దాల కాలం పాటు పనిచేసిన వారు. తమ కాలాన్ని, కరెన్సీని, కండలను సైతం కరిగించేసిన వాళ్ళు. వారు వైసీపీలో చేరినపుడు జగన్ వట్టి ఎంపీ మాత్రెమే. ఆ తరువాత ఆయన జైలుకి కూడా వెళ్ళారు. ఆయన అసలు బయటకు వస్తారో రారో కూడా తెలియని అయోమయంలో కూడా నాడు టీడీపీని ఎదిరించి నిలబడ్డారు. ఇక 2014లో చంద్రబాబు హయాంలో ఎన్నో వేధింపులను భరించి మరీ అలుపెరగని పోరాటమే చేశారు. తీరా చేసి జగన్ ని ముఖ్యమంత్రిగా చూస్తే ఆయన మళ్ళీ టీడీపీయే ముద్దు అంటున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు వాపోతున్నారు.
కొత్త కేంద్రాలుగా….
విశాఖ దక్షిణ నియోజకవర్గం తీసుకుంటే టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ మారారు. ఆయన ఇలా మారడానికి అసలైన కారణం ఎక్కడా పనులు కావడంలేదు. అక్కడ ఇంచార్జిగా ఉన్న వైసీపీ నేత కోలా గురువులు చక్రం తిప్పుతున్నారు. ఆయన మాటనే వినమని అధికారులను కూడా వైసీపీ సర్కార్ ఆదేశించింది. దాంతో ఆయనకే అధికారులు అన్ని రకాల సమాచారం ఇస్తూ పనులు చేసిపెడుతున్నారు. ఇక ఉత్సవ విగ్రహంగా ఉండలేక వాసుపల్లి వైసీపీలోకి జంప్ చేసారు. ఆయన రావడంతో అధికారులు మళ్ళీ ఆయన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇంచార్జిల పాలనకు తెరపడిపోయింది. వాసుపల్లి కూడా తన అనుభవాన్ని అంతా రంగరించి మరీ చక్రం తిప్పేస్తున్నారుట. దీంతో గోడుమనడం వైసీపీ నేతల వంతు అవుతోందిట.
ఆయనే రాజుగా….
ఇక మరో వైపు చూసుకుంటే విశాఖ సిటీలో పశ్చిమ, తూర్పు, ఉత్తర నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఎమ్మెల్యేలు లేరు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. దాంతో ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మీద ఓడిన కేకే రాజు హవా నడుస్తోంది. ఆయనే అసలు ఎమ్మెల్యే అన్నట్లుగా కధ నడుపుతున్నారు. పధకాలు అయినా ప్రారంభోత్సవాలు అయినా అన్నీ ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. ఇపుడు కనుక గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే రాజు గారి కిరీటం ఎగిరిపోతుంది. దీంతో ఆయన ఈ వలసలు వద్దు బాబూ అని వైసీపీ పెద్దలను వేడుకుంటున్నారుట.
ఘనమైన నేతగా….
అదే విధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మీద ఓడిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ తానే ఎమ్మెల్యే అని చెప్పేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కూడా ఆయన మాట చెప్పనిదే ఆకు కూడా కదలని స్థితికి సీన్ తెచ్చారు. అధికారులు ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. కార్యకర్తలకు పనిచేసి పెట్టాలన్నా ఆయనే దిక్కు. మరి మళ్ళ విజయప్రసాద్ కి ఇపుడు చేదు లాంటి వార్త ఒకటి చెవిన పడుతోందిట. తొందరలోనే టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వైసీపీలోకి వస్తారని. దాంతో మళ్ల తల్లడిల్లుతున్నారు. తన వైభోగం ఏం కావాలని ఆయన ఏకంగా హై కమాండ్ ముందే గోడు వెళ్ళబోసుకుంటున్నారుట. అసలు ఎమ్మెల్యే వస్తే తన ఇంచార్జి హోదాకు భంగమే కదా అని బావురుమంటున్నారుట.
అక్కడలా …..
ఇక తూర్పులో మాత్రం వైసీపీ ఇంచార్జిగా ఉన్న అక్రమాని విజయనిర్మలకు ఈ గోడ దూకుళ్ళ బెడద లేదు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణ బాబు తాను బాబుని విడిచి వెళ్లనని స్పష్టం చేశారట. దాంతో ఆయన్ని పక్కన పెట్టి విజయనిర్మల అన్నీ తానే అవుతున్నారు. అయితే ఇక్కడ మరో కొత్త గొడవ ఉంది. అదేంటి అంటే అంతకు ముందు నుంచే తూర్పులో పాతుకుపోయిన వైసీపీ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అన్నిటికీ పోటీ వస్తున్నారుట. ఇక్కడ ఈ ఇద్దరి మధ్యన పోరుతో అటు అధికారులూ, ఇటు కార్యకర్తలూ తలపట్టుకుంటున్నారు. ఎవరి దగ్గరకు వెళ్లాలి. ఎవరితో పని చేయించుకోవాలి అన్నది తెలియక జుత్తు పీక్కున్నారుట. మొత్తానికి చూస్తే విశాఖ సిటీ వైసీపీలో ఎక్కడ చూసినా జోష్ లేదు, బెంగా బెరుకూ కనిపిస్తోంది. మరి హై కమాండ్ వారి బాధలను తీర్చకపోతే జీవీఎంసీ ఎన్నికల నాటికి కష్టమేనని అంటున్నారు.