ఉగాది రోజునే ఆ ప్రకటన.. ఈసారి గ్యారంటీ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు దాదాపు పూర్తయింది. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పదమూడు జిల్లాలున్న [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు దాదాపు పూర్తయింది. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పదమూడు జిల్లాలున్న [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు దాదాపు పూర్తయింది. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పదమూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 19 జిల్లాలను ఏర్పాటు చేసే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది. అంటే టోటల్ గా 32 జిల్లాలు ఏపీలో ఏర్పడబోతున్నాయి. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తును పూర్తి చేశారు. కొత్త జిల్లాలకు పేర్లను ఏం పెట్టాలన్న దానిపై కూడా చర్చిస్తున్నారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని…..
జగన్ పాదయాత్ర చేస్తున్నప్పడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన కమిటీ ని నియమించారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి కొత్త జిల్లాలను వివాద రహితంగా ఏర్పాటు చేయాలని జగన్ కమిటీని ఆదేశించారు.
డిమాండ్లు ఎక్కువ కావడంతో….
అయితే 23 జిల్లాలను జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటు చేస్తే కొన్ని ప్రాంతాల్లో భౌగోళికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల తమ ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ లు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 32 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయంచినట్లు తెలిసింది. ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కొత్త జిల్లాలివే….
కొత్తగా ప్రతిపాదన జిల్లాలుగా కడప, రాజంపేట, కర్నూలు, ఆదోని, నంద్యాల, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి జిల్లాలు సీమలో ఉంటాయి. కోస్తాంధ్రలో గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, అమరావతి, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు, గూడూరు, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం కేంద్రాలుగా జిల్లాలుంటాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస జిల్లాలు ఉంటాయని అనధికారికంగా తెలుస్తోంది. ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.