కొత్త జిల్లాల ఏర్పాటు అభివృద్ధికి బాటలు వేస్తుందా ?
పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక జిల్లా ఇది ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రావడంతోనే కొత్త జిల్లాలపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి. [more]
పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక జిల్లా ఇది ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రావడంతోనే కొత్త జిల్లాలపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి. [more]
పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక జిల్లా ఇది ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రావడంతోనే కొత్త జిల్లాలపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి. ఆయన దీనిపై కసరత్తు మొదలు పెట్టారో లేదో ప్రాంతాల వారీగా వేడి రాజుకుంది. పార్లమెంట్ పరిధి లో ఉండేవే కాకుండా ఇంకా పెంచాలంటూ కొందరు అసలు ఇప్పుడు ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వంపై పడే ఖర్చు అవసరమా అని మరికొందరు వాదనలు, చర్చలు మొదలు పెట్టేశారు. అయితే ప్రజలకు పాలన చేరువ కావాలంటే ఈ ఏర్పాటు మంచిదే అంటున్నారు జిల్లా కేంద్రాలకు దూరంగా వుండే ప్రాంతాల వారు.
తమిళనాడు అభివృద్ధికి అదే పునాది …
ప్రాంతాల వారీ సమతుల అభివృద్ధికి చిన్న చిన్న జిల్లాల ఏర్పాటు చాలా మంచి ప్రక్రియే అని నిరూపించింది తమిళనాడు. ఆ రాష్ట్రంలో 33 జిల్లాలు గా ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయాకా అక్కడి పాలకులు సంఖ్యను పెంచారు. తమిళనాడు అభివృద్ధి కేవలం చెన్నయి కేంద్రం కాకుండా సేలం, కోయంబత్తూర్, తిరుచ్చి, తిరునల్వేలి ప్రాంతాలను ఎంపిక చేసుకుని రాష్ట్రం నలుచెరుగులా అభివృద్ధి బీజాలు నాటారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన అభివృద్ధి జరిగేలా కార్యాచరణ తీసుకున్నారు. ఎక్కువమంది ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో చిన్న జిల్లాలు అన్ని విధాలుగా అభివృద్ధిలో పోటీ పడే అవకాశాలు ఉంటాయి. దాంతో బాటు ప్రభుత్వ విజిలెన్స్ సాఫీగా సాగేందుకు వీలు ఉంటుంది.
కెసిఆర్ అదే ఫాలో అయ్యారు …
తెలంగాణ ఏర్పడ్డాకా కెసిఆర్ తమిళనాడు ఫార్ములా ఫాలో అయ్యారు. 10 జిల్లాల తెలంగాణ ను 31 జిల్లాలుగా చేశారు. ఇటీవల ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నేపథ్యంలో మరో రెండు జిల్లాలను పెంచేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పుడు ఎపి సర్కార్ సైతం ఇదే రూట్ లో వెళుతుంది. విద్యా, వైద్య సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, మౌళిక వసతుల కల్పనకు చిన్న జిల్లాలుగా వున్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టె అవకాశాలు మెండుగా ఉంటాయి. కేంద్ర నిధులు అధికంగా కూడా వెనుకబడిన జిల్లాలకు నేరుగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ గమనంలోకి తీసుకునే ఎపి నయా సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. భౌగోళికంగా ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేశాక కొత్త జిల్లాలు కొత్త సర్కార్ నేతృత్వంలో రావడం శుభపరిణామమే అన్నది విశ్లేషకుల భావన.