జగన్ అడుగులు ఆ దిశగానే?
అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుంది. రాజధాని ని మూడు భాగాలుగా చేయడంలో ఇందులో భాగమే. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ [more]
అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుంది. రాజధాని ని మూడు భాగాలుగా చేయడంలో ఇందులో భాగమే. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ [more]
అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుంది. రాజధాని ని మూడు భాగాలుగా చేయడంలో ఇందులో భాగమే. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తామని ఏపీ లో 25 జిల్లాలను చేస్తామని కూడా ప్రకటించింది కూడా. అయితే కొత్త ప్రభుత్వంగా వైసీపీ కొలువైన తరువాత అమరావతి వివాదాలతోనే సమయం సరిపోయింది. ఆ తరువాత కరోనా ప్రభావంతో ఈ ఆలోచనలు అన్ని జాప్యం అవుతూ వస్తున్నాయి.
అదనంగా ప్రతి జిల్లాకు ఒక్కో ఐ ఏ ఎస్ …
తాజాగా ప్రతి జిల్లాకు అదనంగా మరో ఐఏఎస్ ను నియమిస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వారికి కొన్ని ప్రత్యేక బాధ్యతలు కేటాయించింది. ఇది గమనిస్తే రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక్కో జిల్లాగా చేసేందుకే ఇప్పటినుంచి సర్కార్ కసరత్తు చేస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మూడు రాజధానుల అంశం ఒక కొలిక్కి వచ్చాకా మరో అడుగుగా జిల్లాల పెంపు చేయాలని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
ముందస్తు కసరత్తు….
ఇప్పటికే తెలంగాణ లో విభజన తరువాత కేసీఆర్ పది పాత జిల్లాల స్థానంలో 33 గా మార్చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఇప్పుడు ఐఏఎస్ లను అదనంగా జిల్లాల వారి నియమించడంతో త్వరలో జగన్ సర్కార్ తాను గతంలో చెప్పింది అమలు చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. అందుకోసమే వైసీపీ సర్కార్ ముందస్తు చర్యలను ప్రారంభించిందంటున్నారు.