పట్టం డీకే కే నట
కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రక్తం రానుంది. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి తలకిందులై పోయింది. కాంగ్రెస్ లో ఎన్నికలకు [more]
కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రక్తం రానుంది. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి తలకిందులై పోయింది. కాంగ్రెస్ లో ఎన్నికలకు [more]
కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రక్తం రానుంది. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి తలకిందులై పోయింది. కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందే గ్రూపు విభేదాలు స్పష్టంగా కన్పించాయి. ఆ ప్రభావం ఎన్నికలపై పడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. సిద్ధరామయ్యను వ్యతిరేకించే వర్గం ఈ ఎన్నికల్లో పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసింది. డీకే శివకుమార్ లాంటి సీనియర్ నేతలు సయితం ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకోక పోవడమే ఇందుకు కారణం.
శాసనసభ్యత్వ పదవికి…..
ఎన్నికలు ఫలితాలు వెలువడిన వెంటనే సిద్ధరామయ్య కాంగ్రెస్ శాసనసభ పక్షనేత పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే సీఎల్పీ పోస్టులో సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. అప్పట్లోనూ హైకమాండ్ పై వత్తిడులు వచ్చాయి. డీకే శివకుమార్ లాంటి నేతలు కూడా ఈ పదవి కోసం లాబీయింగ్ చేశారు. తర్వాత డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో దీనిని పట్టించుకోలేదు.
సిద్ధరామయ్య వల్లనే…..
తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు సయితం తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు రెండు స్థానాల్లో నూతన నేతలను నియమించే అవకాశముందని తెలుస్తోంది. సిద్ధరామయ్య ఇక సాదా సీదా నేతగానే కొనసాగనున్నారు. హైకమాండ్ కూడా ఆయనను కొనసాగించే ఆలోచనలో లేదు. సిద్ధరామయ్య వల్లనే కర్ణాటక కాంగ్రెస్ లో విభేదాలు తీవ్రమయ్యాయని తెలిసినా ఉప ఎన్నికల కోసమే ఆయనను పదవిలో కొనసాగించింది. ఇప్పుడు పూర్తిగా అధికారానికి దూరం కావడంతో సిద్ధరామయ్యను పక్కన పెట్టడమే బెస్ట్ అన్న ఆలోచనకు వచ్చింది.
డీకేకు ప్రమోషన్….
వచ్చే ఎన్నికల నాటికి సిద్ధరామయ్యను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి జాతీయ రాజకీయాల వైపు తీసుకెళ్లాలన్నది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతలు పెద్దగా రాణించలేకపోతుండటంతో సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో పార్టీ పదవి ఇవ్వాలని కూడా హైకమాండ్ నిర్ణయించింది. డీకే శివకుమార్ ను రాష్ట్ర స్థాయిలో బూస్ట్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. డీకే శివకుమార్ అందరినీ సమన్వయం పర్చుకునే నేత కావడంతో ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త రక్తం రాబోతుందనే చెప్పాలి.