ముక్కు మూసుకోనక్కర్లేదు.. అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు
న్యూజిల్యాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆర్థికంగా అన్ని దేశాలు అతలాకుతలమవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను [more]
న్యూజిల్యాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆర్థికంగా అన్ని దేశాలు అతలాకుతలమవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను [more]
న్యూజిల్యాండ్ ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలను అందుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆర్థికంగా అన్ని దేశాలు అతలాకుతలమవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అమెరికా వంటి అగ్రరాజ్యమే కరోనా తాకిడికి కకా వికలమయింది. ఈ నేపథ్యంలో న్యూజిల్యాండ్ కరోనా నుంచి బయటపడి ప్రపంచదేశాలన్నింటికి ఆదర్శంగా నిలిచింది.
చిన్న దేశం కావడంతో….
న్యూజిల్యాండ్ అతి చిన్న దేశం. కేవలం యాభై లక్షల జనాభా మాత్రమే ఉంటుంది. న్యూజిల్యాండ్ ఆదాయం అంతా పర్యాటకంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. తొలిదశ కరోనా వైరస్ సోకినప్పుడు దేశ సరిహద్దులన్నింటిని ప్రభుత్వం మూసివేసింది. ఏ దేశం నుంచి కూడా ఇతరులను అనుమతించలేదు. పర్యాటక రంగం నుంచి ఆదాయం దెబ్బతింటుందని తెలిసినా ప్రజారోగ్యానికే న్యూజిల్యాండ్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
తొలి కేసు నమోదయిన నాటి నుంచి….
2020 మార్చి లో న్యూజిల్యాండ్ లో తొలి కరోనా కేసు నమోదయింది. వెంటనే అప్రమత్తమయిన ప్రభుత్వం ముందుగా అందరికీ పరీక్షలు చేయించింది. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించింది. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యాన్ని అందించింది. విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడు వారాల పాటు కఠిన మైన లాక్ డౌన్ ను న్యూజిల్యాండ్ ప్రభుత్వం విధించింది.
ఏడు వారాల పాటు….
దీంతో వైరస్ ను కేవలం ఏడు వారాల్లోనూ న్యూజిల్యాండ్ ప్రభుత్వం తరిమికొట్టగలిగింది. న్యూజిల్యాండ్ చేసిన ప్రయోగంపై అన్ని దేశాలు అధ్యయనం చేసినా ఆ ప్రయత్నాలు చేయలేని పరిస్థితి. న్యూజల్యాండ్ లో కేవలం 2,600 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 26 మంది మృతి చెందారు. చిన్న దేశం కావడం, విసిరేసి ఉండేటట్లు దేశం ఉండటంతోనే సాధ్యమయిందంటు న్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనాతో భయపడి బతుకుతుంటే న్యూజిల్యాండ్ లో మాత్రం తలెత్తుకుని, ముక్కు తెరుచుకుని మరీ తిరుగుతున్నారు.