నిద్రపోని నగరం.. ఇప్పుడిలా అయిందేమిటి?
అమెరికా కరోనా వైరస్ కు తట్టుకోలేకపోతోంది. అగ్రరాజ్యం ఇతర దేశాల సాయం కోసం చూస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తమ దేశానికి పంపాలంటూ భారత ప్రధాని మోదీని ట్రంప్ [more]
అమెరికా కరోనా వైరస్ కు తట్టుకోలేకపోతోంది. అగ్రరాజ్యం ఇతర దేశాల సాయం కోసం చూస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తమ దేశానికి పంపాలంటూ భారత ప్రధాని మోదీని ట్రంప్ [more]
అమెరికా కరోనా వైరస్ కు తట్టుకోలేకపోతోంది. అగ్రరాజ్యం ఇతర దేశాల సాయం కోసం చూస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తమ దేశానికి పంపాలంటూ భారత ప్రధాని మోదీని ట్రంప్ అభ్యర్థించారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే అమెరికాలో మూడున్నర లక్షల వరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పదివేలకు దగ్గరలో మరణాలు ఉన్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరం కరోనాతో విలవిలలడుతోంది.
వాణిజ్య నగరంగా…
న్యూయార్క్ నగరం అంటే ప్రపంచానికే ఒక ఆదర్శం. వాణజ్య నగరంగా పేరు. ఈ నగరానికి నిద్రపోని నగరంగానూ పేరుంది. అలాంటి న్యూయార్క్ నగరం ఇప్పుడు కరోనా వైరస్ తో కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. వ్యాపార రాజధానిలో ఇప్పుడు మృత్యుఘోష వినపడుతోంది. అమెరికాలో మూడున్నర లక్షల మందికి కరోనా వైరస్ సోకితే ఒక్క న్యూయార్క్ నగరంలోనే లక్షన్నర ఉందంటే ఏ స్థాయిలో న్యూయార్క్ విలవిలలాడుతుందో అర్థమవుతోంది.
చైనా టౌన్ వల్లనేనా?
ఇక న్యూయార్క్ కు దగ్గరలోనే చైనా టౌన్ ఉంది. అక్కడ దీనిని చైనా టౌన్ గానే పిలుస్తారు. ఇక్కడ లక్షలమంది చైనీయులు నివసిస్తారు. వ్యాపారాలు చేసుకుంటారు. వూహాన్ లో కరోనా వైరస్ ప్రబలిన తర్వాత దాదాపు నాలుగు లక్షల మంది చైనా నుంచి అమెరికా వచ్చారని తెలుస్తోంది. వీరంతా అమెరికాలోని పదిహేడు నగరాలకు చేరుకున్నారు. ఇందులో న్యూయార్క్ కు అధికమంది చేరుకున్నారని చెబుతున్నారు. వీరి కారణంగానే న్యూయార్క్ సిటీ కరోనా వైరస్ కు బలయిందన్న అభిప్రాయం అంతా వ్యక్తమవుతోంది.
శ్మశాన వాటికలో కూడా…..
న్యూయార్క్ సిటీని చూస్తే ప్రపంచం జాలి పడే స్థితికి వచ్చింది. కనీసం శ్మశాన వాటికలో కూడా చోటులేదు. ఎటు చూసినా శవాల గుట్టలే. వీటిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్ పార్క్ ను సయితం కోవిడ్ ఆసుపత్రిగా మార్చినా కరోనా బాధితుల రద్దీ తగ్గడం లేదు. మరో రెండు వారాల పాటు ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ లోనే తెలుగువారు అధికంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూయార్క్ నగరం మాత్రం ఇప్పుట్లో కోలుకునేలా కన్పించడం లేదు.