అందుకేనా నిమ్మగడ్డ రిజెక్ట్ చేసింది?
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలను తిరస్కరించారు. ఇందుకు కారణాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలను తిరస్కరించారు. ఇందుకు కారణాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ శాఖలోని ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీలను తిరస్కరించారు. ఇందుకు కారణాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్ లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా కాలం నుంచి గుర్రుగా ఉన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు.
రక్షణ కల్పించేందుకే…..
అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రభుత్వం ఆ ఇద్దరు అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి వారికి ఉద్యోగ పరంగా రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం ముందుగా బదిలీ చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ అంటేనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మండి పడుతున్నారు. తనకు సహకారం అందించకుండా ఆయన ముప్పు తిప్పలు పెట్టారని భావిస్తున్నారు.
చర్యలు తప్పవని హెచ్చరిక….
అందుకే ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఇద్దరు అధికారులపై తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. ఓటర్ల జాబితా సవరణను చేయకపోవడం, ఓటర్ల జాబితాను రూపొందించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వానికి అనుకూలంగా సహకరించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలంగా విశ్వసిస్తున్నారు.
అందుకే బదిలీ తిరస్కరణ…
దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. అయితే ప్రభుత్వం తెలివిగా వారిద్దరినీ వేరే శాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుపట్టారు. వాస్తవానికి అయితే వారిద్దరిని తప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరాల్సి ఉంది. అయితే చర్యలు తీసుకోవడానికే ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదంటున్నారు. మొత్తం మీద వారిపై చర్యలు తీసుకునేంతవరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఊరుకునేట్లు లేదు.మరి ఏం జరుగుతుందో చూడాలి.