నిమ్మగడ్డ ఇక ఆగేట్టు లేరు.. జగన్ కోటరీకే గురి….?
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక తెగించినట్లే కనపడుతుంది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఆయన సన్నిహితులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేశారు. నిన్నటి [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక తెగించినట్లే కనపడుతుంది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఆయన సన్నిహితులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేశారు. నిన్నటి [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక తెగించినట్లే కనపడుతుంది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఆయన సన్నిహితులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేశారు. నిన్నటి వరకూ ప్రభుత్వ అధికారులను బదిలీచేయాలని ఆదేశించి, కొందరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా జగన్ క్లోజ్ సర్కిల్ పై పంజా విసురుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత దూకుడు పెంచే అవకాశముంది.
సీమ టూర్ అందుకేనా?
ఈరోజు ఉదయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాయలసీమ టూర్ పెట్టుకున్నారు. అక్కడ వైసీపీ బలంగా ఉండటంతో ఎలాంటి ఏకగ్రీవాలు, ఏకపక్షంగా ఎన్నికలు జరగకుండా ఆయన తొలి పర్యటనే సీమ జిల్లాల్లో పెట్టుకున్నారు. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కర్నూలు, కడప జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాల పర్యటనను ఎంచుకోవడం విశేషం. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ఎటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడకుండా చూడటం కోసమే ఆయన ఈ జిల్లాల పర్యటన పెట్టుకున్నారు.
సీఎంవో కార్యాలయాన్ని…..
ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాయలంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని చీఫ్ సెక్రటరీ కి రాసిన లేఖలో కోరారు. జిల్లా అధికారులను ప్రవీణ్ ప్రకాష్ సీఎంవో లు కూర్చొని ప్రభావం చేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. . ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని తొలగించేందుకు అవసరమైతే అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని కూడా గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పై తనకు నమ్మకంలేదని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది.
మంత్రులను సయితం…..
దీంతో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సయితం రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయంపైన తాను అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవలసి ఉంటుందని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. మొత్తం గా చూస్తే జగన్ కోటరీని నిమ్మగడ్డ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో నిమ్మగడ్డ మరిన్ని లేఖలు రాసే అవకాశముందంటున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ ను ఎలా తగ్గించాలన్న దానిపై వైసీపీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు.