నిమ్మగడ్డ చంద్రబాబుకు చేటు తెస్తున్నారా?
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరకంగా జగన్ కు మంచి చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. కొద్దో గొప్పో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరకంగా జగన్ కు మంచి చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. కొద్దో గొప్పో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరకంగా జగన్ కు మంచి చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. కొద్దో గొప్పో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోగొడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరోవైపు టీడీపీకి ఆయన తెలియకుండానే హాని చేస్తున్నారని చెప్పక తప్పదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న వరస నిర్ణయాలతో ప్రభుత్వంపై సానుభూతి పెరగడం ఖాయం. అదే విధంగా చంద్రబాబు మీద వ్యతిరేకత రావడం అనివార్యంగా కన్పిస్తుంది.
నిబంధనల పేరుతో….
151 సీట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిబంధనల పేరుతో తొక్కేయాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫేస్టో విడుదల చేసినా ఆయనపై చర్యలకు దిగకకపోవడంపైన కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు విన్పిస్తున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆయన ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లింది.
ఇప్పటికే ఆరోపణలతో….
కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలను నిర్వహించడమే అనేక మంది తప్పు పడుతున్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. దీనికి తోడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న వరస నిర్ణయాలు వైసీపీ పార్టీకి, ఇటు ప్రభుత్వానికి కూడా భవిష్యత్ లో అనుకూలంగా మారనున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులను ఆయన టార్గెట్ చేయడంతో పాటు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటాన్ని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది.
తాత్కాలిక ఆనందమేనా?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు తాత్కాలికంగా టీడీపీకి ఆనందం కల్గవచ్చేమో కాని, దీర్ఘకాలంలో పార్టీకి ఇబ్బందిగా మారతాయని చెప్పక తప్పదు. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏదో రకంగా చంద్రబాబు పాలనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు జగన్ ను ముఖ్యమంత్రిగా పనిచేయనీయడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిని నిజం చేస్తూ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి చేటు తెస్తాయన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.