అందరికీ విలన్ అయ్యారు…? మరి తర్వాతో?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఇరవై రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. ఆయన అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఇరవై రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. ఆయన అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఇరవై రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. ఆయన అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. పంచాయతీ ఎన్నికలతో పాటు, మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తి చేశారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహించి రెండు పార్టీలకూ విలన్ గా మారారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పొగిడిన టీడీపీ ఇప్పుడు ఆయనపై విమర్శలు చేస్తుంది.
ఏడాది నుంచి యుద్ధమే….
గత ఏడాది మార్చి నెల నుంచే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం మొదలయింది. ఆయనను తొలగంచి కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన పదవిని తిరిగి దక్కించుకున్నారు. మూడు నెలల పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వం మధ్య పెద్దయుద్ధమే జరిగింది. ఆయన హైదరాబాద్ లోని బీజేపీ నేతలను ఒక హోటల్ లో కలవడం కూడా అప్పట్లో వివాదంగా మారింది.
నోటిఫికేషన్ తర్వాత….
అటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి కొంత అనుకూలంగా మారారంటున్నారు. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడ ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచే ప్రక్రియను మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆయన దేనిపైనా యాక్షన్ తీసుకోలేదు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని వంటి వారిపైనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు తప్పించి ఇక మిగతాదంతా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకున్నారని టీడీపీ నేతల ఆరోపణ.
అటు జగన్.. ఇటు చంద్రబాబు…..
తొలినాళ్లలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కులం పేరెత్తి మరీ ముఖ్యమంత్రి జగన్ తప్పుపట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆయనపై ప్రతిరోజూ నిప్పులు చెరుగుతున్నారు. తాము సాక్షాధారాలతో ఇచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటువంటి యాక్షన్ తీసుకోవడంలేదని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. మరో ఇరవై రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటు అధికార పార్టీకి, అటు ప్రతిపక్ష టీడీపీకి శత్రువులా మారారు. మరి పదవీ విరమణ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.