నిమ్మగడ్డ ఆశలు ఆవిరేనా …?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీకాలం ముగిసేలోగా స్థానిక ఎన్నికలు జరిపించేయాలని ఆశ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయన పదవిలో ఉండగా [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీకాలం ముగిసేలోగా స్థానిక ఎన్నికలు జరిపించేయాలని ఆశ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయన పదవిలో ఉండగా [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీకాలం ముగిసేలోగా స్థానిక ఎన్నికలు జరిపించేయాలని ఆశ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయన పదవిలో ఉండగా ఎన్నికలు జరపకూడదని అధికార వైసిపి పార్టీ భావిస్తుంది. దీనికోసం ఇరు వర్గాలు ఎంతకన్నా తెగించే ధోరణి ఎంచుకున్నారు. అటు ప్రభుత్వం ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెగేదాకా వ్యవహారం లాక్కొస్తున్నారు. తాజాగా న్యాయస్థానం ద్వారా తాను అనుకున్నది చేసి తీరాలని సీఈసీ అడుగులు వేస్తున్నారు. కోర్ట్ లో తమకు పని అయ్యేలా లేకపోవడంతో సర్కార్ ఎన్నికల ఆలస్యానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎత్తుకు పై ఎత్తు వేసింది.
అసెంబ్లీ తీర్మానంతో …
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గొప్పదా ? న్యాయస్థానాలు గొప్పవా అనే రీతిలో ఎపి లో వార్ ముదిరిపోయింది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్ట్ ద్వారా వస్తే తాము అసెంబ్లీనే అస్త్రంగా చేసుకుని ఆయనపై ప్రయోగిస్తామని చెప్పక చెప్పింది జగన్ సర్కార్. ఎపి అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కుదరదంటూ తీర్మానం చేసేయడంతో నిమ్మగడ్డ ఉలిక్కి పడ్డారు. తదుపరి ఆర్డినెన్స్ తెచ్చి తన చర్యలను అడ్డుకుంటారని అంచనా వేయడంతో నేరుగా గవర్నర్ కి లేఖ రాసి మరో సంచలనానికి తెరతీశారు ఆయన. దీనిపై సర్కార్ తరపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఎప్పటిలాగే మంత్రి కొడాలి నాని రంగం లోకి దిగి ఇచ్చేశారు. నాని తిట్టే తిట్లు విన్నవారికి చెవుల్లోనుంచి రక్తాలు కారాలిసిందే. చంద్రబాబు తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ నానా దూషణలు చేశారు నాని. ఒకరేంజ్ లోమంత్రి సీఈసీ పై తన అష్టోత్తరం చదివేశారు.
ఎన్నికలు ఫిబ్రవరి లో లేనట్లే … ?
ప్రస్తుత యుద్ధంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కార్ పై ఓటమి తప్పకపోవొచ్చని పలువురు భావిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం ఆ తరువాత ఆర్డినెన్స్ తెస్తే కోర్ట్ లు కూడా దీనిపై ఏమి చేయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. ఇది అంచనా వేసే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను లేఖ ద్వారా ఆశ్రయించారని లెక్కేస్తున్నారు. ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లు స్థానిక ఎన్నికల అంశంపై సాగిస్తున్న పోరాటం తప్పనిసరిగా ఆలస్యం అయ్యేలాగే ఉంది. అసెంబ్లీ తీర్మానం ఆర్డినెన్స్ లపై నిమ్మగడ్డ కోర్ట్ కి వెళ్ళినా వర్క్ అవుట్ కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.