వామ్మో నిమ్స్ …!!?
హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి దేశంలోనే ఒక మంచి పేరు వుంది. ఎక్కడెక్కడి రోగులో ఇక్కడికి వచ్చి చికిత్స పొంది స్వస్థతతో [more]
హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి దేశంలోనే ఒక మంచి పేరు వుంది. ఎక్కడెక్కడి రోగులో ఇక్కడికి వచ్చి చికిత్స పొంది స్వస్థతతో [more]
హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి దేశంలోనే ఒక మంచి పేరు వుంది. ఎక్కడెక్కడి రోగులో ఇక్కడికి వచ్చి చికిత్స పొంది స్వస్థతతో తిరిగి ఇంటికి వెళతారు. అత్యంత ప్రతిష్టాత్మకం అయిన ఈ వైద్య సంస్థకు ఇటీవల కాలంలో చెడ్డ పేరు వస్తుంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యపూరిత వ్యవహారం రోగుల ప్రాణాలు తీస్తుంది. తాజాగా ఒక ఘటన నిమ్స్ పేరుకు మరోసారి మచ్చ తెచ్చింది.
కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు…
హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం మహేశ్వరీ చౌదరి అనే మహిళ నిమ్స్ లో శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆపరేషన్ చేసిన తరువాత ఆమెకు కడుపులో నొప్పి ఎక్కువైంది కానీ తక్కువ కాలేదు. ఆ నొప్పి పెరుగుతూ పెరుగుతూ భరించలేనంతగా మారడంతో తిరిగి నిమ్స్ కి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కడుపులో కత్తెర పెట్టి వైద్యులు వదిలివేసిన సంగతి వెలుగు చూసింది. వ్యవహారం తేలడంతో ఆమె బంధువులు ఉగ్రులయ్యారు.
బాధ్యులను శిక్షిస్తామన్న నిమ్స్ …
తక్షణం ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు కోరుతూ ఆందోళన చేయడంతో నిమ్స్ డైరెక్టర్లు ముగ్గురితో కూడిన కమిటీని విచారణకు ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అయ్యింది. బాధితురాలికి ఆపరేషన్ చేసి కత్తెర తొలగించి బంధువులకు, ఆమెకు క్షమాపణ చెప్పింది. కొండనాలికకు మందు వేస్తే వున్న నాలిక ఊడినట్లు చికిత్స కోసం వెళితే ప్రాణాలే తీసేలా వున్నారని వైద్యుల నిర్లక్ష్యం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి నిమ్స్ ఈ సంఘటన పై బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.