గడ్కరీ మాటలు చెవికెక్కుతాయా?
నితిన్ గడ్కరీ పెద్ద మనిషి. బీజేపీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన వారు. సీనియర్ మోస్ట్ లీడర్, ప్రధాని రేసులో అపుడపుడు వినిపించే అతి కొద్ది మంది నేతల్లో [more]
నితిన్ గడ్కరీ పెద్ద మనిషి. బీజేపీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన వారు. సీనియర్ మోస్ట్ లీడర్, ప్రధాని రేసులో అపుడపుడు వినిపించే అతి కొద్ది మంది నేతల్లో [more]
నితిన్ గడ్కరీ పెద్ద మనిషి. బీజేపీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన వారు. సీనియర్ మోస్ట్ లీడర్, ప్రధాని రేసులో అపుడపుడు వినిపించే అతి కొద్ది మంది నేతల్లో ఆయనొకరు. ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్న ఈ మరాఠీ నేత మోడీ సర్కార్ లో కీలకమైన శాఖలు నిర్వహిస్తున్నారు. తన సొంత రాష్ట్రంలో పట్టు బాగా ఉన్న నితిన్ గడ్కరీ బీజేపీ వర్తమాన రాజకీయాల్లో అతి కీలకమైన నేత. అటువంటి నితిన్ గడ్కరీ నోట మేలి ముత్యాలలాంటి మాటలు తాజాగా వచ్చాయి. తేడా కలిగిన పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీలో వాజ్ పేయ్, అద్వానీ శకం ముగిశాక ఎన్నడూ వినని మాటలు నితిన్ గడ్కరీ వల్లించారు. మరి ఇపుడున్న బీజేపీ నేతల చెవులకు అవి ఎక్కుతాయా అన్నదే ప్రశ్న.
అయారాం గయారాంలు వద్దు….
తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ పార్టీ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశాలు ఇవ్వాలని, బయట వారికి వద్దు అని నితిన్ గడ్కరీ అన్నారు. అంతే కాదు, అధికారం ఉంది కదా బీజేపీ వద్దకు చేరుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసలు అలాంటి అయారాం గయారం నేతలు బీజేపీకి ఎందుకు అని కూడా నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. బీజేపీ ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ చేరారు, రేపు మరో పార్టీ అధికారంలో ఉంటే అక్కడికి పోతారు. అలాంటి నేతలు మనకు అవసరమా అని గడ్కరీ అన్న మాటలు ఒక్క బీజేపీకే కాదు అన్ని పార్టీలకు ఇపుడున్న రోజుల్లో ఆదర్శనీయమే. మరి అన్ని పార్టీలకంటే కూడా జోరు మీద ఉన్న బీజేపీ నేతలు చెవులు రిక్కించి మరీ వినాల్సిన మాటలు కూడా ఇవి.
ఏపీలో గయారాంలెందరో…?
ఏపీలో ఒక్కసారిగా టీడీపీ తమ్ముళ్ళు బీజేపీ మీద ప్రేమ ఒలకబోస్తూ వచ్చి చేరిపోయారు. వారిని అక్కున చేర్చుకుని బీజేపీ పెద్దలు కండువా కప్పితే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారికి రాజముద్ర వేసి బీజేపీ సభ్యులను చేసేశారు. మరికొందరు జంపింగ్ జఫానుల కోసం ఏపీ బీజేపీ ఎదురుచూస్తూంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తామని ఇంకో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ కె మురళీధర రావు అంటున్నారు. మరి ఏంటిదంతా. ఫిరాయింపులదారులను చేర్చుకుని బలపడదామనేగా. గడ్కరీ మాటలను ఒక్కసారి అంతా వింటే సొంత పార్టీ నేతలకు అవకాశాలు ఇవ్వాలి. బీజేపీని సొంతంగానే అభివృధ్ధి చేసుకోవాలి. అపుడే కదా తేడా గల పార్టీ తేడా జనాలకు తెలిసేది. మరి కమలనాధులకు నితిన్ గడ్కరీ మంచి మాటలు చెవికెక్కుతాయా అన్నదే ప్రశ్న.