నితీష్ పూర్తికాలం సీఎంగా ఉంటారా?
బీహార్ ముఖ్యమంత్రి గా నితీష్ కుమార్ నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నాయకత్వం ఈ మేరకు ప్రకటించింది. నికార్సయిన నేతగా నితీష్ కుమార్ కు [more]
బీహార్ ముఖ్యమంత్రి గా నితీష్ కుమార్ నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నాయకత్వం ఈ మేరకు ప్రకటించింది. నికార్సయిన నేతగా నితీష్ కుమార్ కు [more]
బీహార్ ముఖ్యమంత్రి గా నితీష్ కుమార్ నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నాయకత్వం ఈ మేరకు ప్రకటించింది. నికార్సయిన నేతగా నితీష్ కుమార్ కు పేరుంది. దేశంలో విలువలతో కూడిన రాజకీయాలు నడుపుతున్న అతి కొద్ది మంది నేతల్లో నితీష్ కుమార్ ఒకరు. దాదాపు పదిహేనేళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మద్యపాన నిషేధం వంటివి పక్కాగా అమలు చేస్తున్నారు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో…..
1970వ దశకం నుంచి నితీష్ కుమార్ రాజకీయాల్లో ఉన్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలోనూ ఆయన అనేక పదవులు నిర్వహించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన నితీష్ కుమార్ 2004 నుంచి బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటే ఇరవైఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించినట్లవుతుంది. వాజ్ పేయి హయాం నుంచే నితీష్ కుమార్ కు బీజేపీతో సంబంధాలున్నాయి.
టార్గెట్ అంతా ఆయనే…..
అయితే ఈసారి నితీష్ కుమార్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటు ఆర్జేడీ నితీష్ కుమార్ నే టార్గెట్ చేసింది. అలాగే ఎన్డీఏ నుంచి విడిపోయి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ కూడా నితీష్ కుమార్ పైనే విమర్శలు చేసింది. అంటే బీహార్ లో అన్ని రాజకీయ పార్టీలు మోదీ, బీజేపీలకంటే నితీష్ కుమార్ నే లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో నితీష్ కుమార్ తనకు చివరి అవకాశమని, ఇవే చివరి ఎన్నికలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొన్ని రోజులు ఆగి…..
నిజానికి జేడీయూకు తక్కువ స్థానాలు వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరంచింది. అయినా ఇచ్చిన మాట ప్రకారం నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. గత ఏడాదిగా నితీష్ కుమార్ పాలనపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పటికీ రానున్న కాలంలో నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని అక్కడ బీజేపీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందన్న ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద నితీష్ కుమార్ నాలుగోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. పూర్తి కాలం ఆయన సీఎంగా కొనసాగుతారని ఆశిద్దాం.