అంటకాగినందునే… అనుభవించాల్సి వస్తుందా?
నితీష్ కుమార్ బీహార్ సిఎంగా మూడు దఫాల నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన నిజాయితీకి మారుపేరు. ఇక బీహార్ లో మద్యనిషేధం అమలు, మహిళల కోసం అనేక [more]
నితీష్ కుమార్ బీహార్ సిఎంగా మూడు దఫాల నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన నిజాయితీకి మారుపేరు. ఇక బీహార్ లో మద్యనిషేధం అమలు, మహిళల కోసం అనేక [more]
నితీష్ కుమార్ బీహార్ సిఎంగా మూడు దఫాల నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన నిజాయితీకి మారుపేరు. ఇక బీహార్ లో మద్యనిషేధం అమలు, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే నితీష్ కుమార్ ఓటమి ఈసారి ఖాయమని తేలింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆర్జేడీ వైపు మొగ్గు చూపారు. తేజస్వి నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది.
బీజేపీతో చేతులు కలిపి…..
అయితే నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలపడం వల్లనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా 36 శాతం మంది తేజస్వియాదవ్ కు మద్దతు పలికితే, నితీష కుమార్ కు 34 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. అభిప్రాయంలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ దాదాపు బీజేపీ అనుకూల మీడియా సయితం నితీష్ కుమార్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తేల్చింది.
లాలూ కుటుంబంపై…..
ప్రధానంగా బీహార్ లో 2015 ఎన్నికల్లో మహాగడ్బంధన్ విజయం సాధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి అత్యధిక సీట్లు వచ్చినా నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. కానీ నితీష్ కుమార్ మాత్రం లాలూ కుటుంబంలో అవినీతిని బూచిగా చూపి బీజేపీ వైపు మొగ్గు చూపారని ప్రజలు బలంగా అభిప్రాయపడ్డారని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన లాలూ కుటుంబానికి నితీష్ కుమార్ మోసం చేశారని బలంగా ముద్రపడింది.
అందుకే వ్యతిరేకత…..
దీనితో పాటు పార్టీని స్థాపించిన శరద్ యాదవ్ ను సయితం జేడీయూ నుంచి తప్పించడం కూడా నితీష్ కుమార్ పై ప్రజల ఆగ్రహానికి కారణమయింది. దీంతో పాటు కరోనా సమయంలో వలస కూలీలను రాష్ట్రానికి రప్పించడంలో విఫలమవ్వడం, నిరుద్యోగంతో యువకులు ఎక్కువగా నితీష్ కుమార్ పై వ్యతిరేకత పెంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంతమేర నిజమవుతాయన్నది పక్కన పెడితే నితీష్ కుమార్ కు మాత్రం కష్టకాలమేనని చెప్పకతప్పదు.