ఈయన పార్టీలో ఉన్నారా? లేదా?
తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నేతల కొరత ఏర్పడింది. చంద్రబాబు నిర్ణయాలతో మైనారిటీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పదవి ఇచ్చినప్పటికీ, మొన్నటి [more]
తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నేతల కొరత ఏర్పడింది. చంద్రబాబు నిర్ణయాలతో మైనారిటీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పదవి ఇచ్చినప్పటికీ, మొన్నటి [more]
తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నేతల కొరత ఏర్పడింది. చంద్రబాబు నిర్ణయాలతో మైనారిటీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పదవి ఇచ్చినప్పటికీ, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మైనారిటీ నేతలు పూర్తిగా దూరమయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ గతకొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు.
బీజేపీ వైపు మొగ్గుతో…?
చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ లో మైనారిటీ నేతల వాయిస్ కొరవడింది. ఈ నేపథ్యంలో ఎన్ఎండీ ఫరూక్ కు చంద్రబాబు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు తెలిసింది. ఎన్ఎండీ ఫరూక్ నంద్యాలకు చెందిన సీనియర్ నేత. అనేకసార్లు మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్ఎండీ ఫరూక్ టీడీపీలోనే ఉన్నారు. రాయలసీమలో మైనారిటీ నేతగా ఎన్ఎండీ ఫరూక్ కు గుర్తింపు ఉంది.
ఎమ్మెల్సీని చేసి…
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ఎండీ ఫరూక్ కు టిక్కెట్ ఇవ్వలేదు. అక్కడ శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వాల్సి రావడంతో ఫరూక్ ను పక్కన పెట్టారు. అయితే శిల్పా ఓటమి పాలు కావడం, భూమా నాగిరెడ్డి గెలిచి పార్టీలోకి రావడం జరిగిపోయాయి. ఒక దశలో ఎన్ఎండీ ఫరూక్ టీడీపీని వీడతారన్న వార్తలు కూడా వచ్చాయి. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. దీంతో అప్పడు ఎన్ఎండీ ఫరూక్ దశ మారింది. వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసనమండలి ఛైర్మన ను చేశారు చంద్రబాబు.
మంత్రి పదవి ఇచ్చినా?
ఆ తర్వాత మంత్రివర్గంలో ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారు ఎవరూ లేకపోవడంతో ఫరూక్ ను మంత్రిని కూడా చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మైనారిటీ, వైద్య ఆరోగ్య శాఖను కూడా చంద్రబాబు కట్టబెట్టారు. అయితే కీలక సమయంలో ఎన్ఎండీ ఫరూక్ వంటి నేతలు మౌనంగా ఉండటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీనిపై ఇటీవల పార్టీలోని సీనియర్ మైనారిటీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. మైనారిటీ ఓట్లను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలన్న చంద్రబాబు ఆలోచనకు సీనియర్ నేతలు సహకరించడం లేదంటున్నారు.