అమెరికా డొల్లతనం తెలిసిపోయిందిగా?
అమెరికా… యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యం. సైనిక సాధన సంపత్తిలో దానికి తిరుగులేదు. సాంకేతిక రంగంలో ఎదురులేదు. అన్ని రంగాల్లో అగ్రరాజ్యానిదే పైచేయి. రెండు శతాబ్దాలకు పైగా సుదీర్ఘ [more]
అమెరికా… యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యం. సైనిక సాధన సంపత్తిలో దానికి తిరుగులేదు. సాంకేతిక రంగంలో ఎదురులేదు. అన్ని రంగాల్లో అగ్రరాజ్యానిదే పైచేయి. రెండు శతాబ్దాలకు పైగా సుదీర్ఘ [more]
అమెరికా… యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యం. సైనిక సాధన సంపత్తిలో దానికి తిరుగులేదు. సాంకేతిక రంగంలో ఎదురులేదు. అన్ని రంగాల్లో అగ్రరాజ్యానిదే పైచేయి. రెండు శతాబ్దాలకు పైగా సుదీర్ఘ చరిత్ర గల ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా, మారుపేరులా నిలుస్తోంది. కానీ కొన్ని విషయాల్లో ఆ దేశంలో ఉ్నంత గందరగోళం మరే దేశంలోనూ లేదు. నవంబరు 2న అధ్యక్షఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికీ అధికారికంగా ఫలితాలను ప్రకటించలేని దుస్థితిలో అగ్రరాజ్యం ఉందంటే ఎవరికైనా ఆశ్ఛర్యం కలగక మానదు. అధికారిక ప్రకటన లేని కారణంగా జో బైడెన్ ను నూతన అధ్యక్షుడిగా తాము గుర్తించబోమని రష్యా, చైనా వంటి కీలక దేశాలు ప్రకటించాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అదే లోపం….
ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా జాతీయస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన కేంద్ర ఎన్నికల సంఘం అమెరికాలో లేకపోవడం పెద్ద లోపం. ఓటర్ల నమోదు నుంచి, ఫలితాల వెల్లడి వరకు గల అస్పష్టతే ఇందుకు కారణం. ఒక్కసారి లోతుల్లోకి వెళితే అగ్రరాజ్యం డొల్లతనం బయట పడుతుంది. రాష్ర్టస్థాయి ఎన్నికల కమిషన్లే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తాయి. మొత్తం 50 రాష్రాలకుగాను 33 చోట్ల రాజకీయ నాయకులను ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునే వెసులుబాటు ఉంది. చాలాచోట్ల వీరు పార్టీల ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించే అధికారులకు పెద్దగా అధికారాలు ఉండవు. ఎన్నికల వివాదాల పరిష్కారానికి రాష్రానికి ఒక నిబంధన ఉంటుంది. ఎన్నికల వ్యాజ్యాలను పరిష్కరించే నైపుణ్యం న్యాయమూర్తులకు ఉండదన్న అభిప్రాయం ఉంది. ఓట్ల లెక్కింపునకూ ఓ విధానం అంటూ ఏమీ లేదు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువ. ఎన్నికల రోజున చాలా దేశాలు జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తాయి. కానీ అగ్రరాజ్యంలో ఈ సౌకర్యం లేదు. ఆరోజు అమెరికాలో పనిదినమే కావడం గమనార్హం.
ఓటరు నమోదులో కూడా….
ఓటరు నమోదు ప్రక్రియ కూడా చాలా సంక్లిష్టం. ఇందులో కూడా ఒక్కో రాష్రానికి ఒక్కో రూలు. దీనికి సంబంధించి ప్రభుత్వపరంగా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. దీంతో ఈ బాధలు పడలేక అనేకమంది అసలు ఓటరుగా నమోదుకే సుముఖత చూపరు. అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఓటరు గుర్తింపు కార్డు విధానం అమల్లో ఉంది. కానీ అమెరికాలో ఆ విధానం లేదు. దేనిని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారో, దేనిని తిరస్కరిస్తారో తేల్చి చెప్పడం కష్టం. పేరుకు స్వేచ్ఛాయుత ఎన్నికలే గానీ ఆచరణలో అది ఎండమావే. కొంతమందికి ఓటుహక్కు లేకుండా చేయడం, ఉన్నా ఓటేయకుండా అడ్డంకులు కల్పించడం వంటి అనుచిత విధానాలనకు పార్టీలు పాల్పడు తుంటాయి. తమ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతాలన్నింటిని కలిపి ఒక నియోజకవర్గంగా మార్చుకునే సౌలభ్యం ఇక్కడి పార్టీలకు ఉంది. అధికార పార్టీలు ఎప్పటికప్పుడు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటాయి. అక్రమాలకు ఇక్కడే బీజం పడుతుంది.
ప్రజాస్వామ్యం ఏదీ?
ఇన్ని లోపాల కారణంగానే ఓడిపోయిన అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడం సహజమైంది. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ పనిలోనే బిజీగా ఉన్నారు. అధికారాన్ని త్యజించను అనే మాట అధ్యక్షుడి నోట రావడం కూడా అమెరికాలోనే వింటాం. ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో ఈ మాట రానేరాదు. సుదీర్ఘకాలం అధికారాన్ని అనుభవించిన ఇందిరాగాంధీ, రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రులగా పనిచేసిన పవన్ కుమార్ ఛామ్లింగ్ (సిక్కిం), జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్), మాణిక్ సర్కార్ (త్రిపుర) వంటి ఉద్ధండులే ప్రజాతీర్పును శిరసావహించి పదవుల నుంచి వైదొలగారు. ఇలాంటి పరిణతి సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్ర గల దేశమని చంకలు గుద్దుకునే అమెరికా ఏనాటికి సాధిస్తుందన్నది ప్రశ్నార్థకమే. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మారిననాడే ఏ వ్యవస్థ అయినా పటిష్టమవుతుంది. అలాంటి మార్పులకు దూరమవడమే ప్రస్తుత అమెరికా పరిస్థితికి కారణమని చెప్పకతప్పదు.
-ఎడిటోరియల్ డెస్క్