Ys jagan : ఏడాది ముందు ఇది మామూలేనా?
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరమవుతున్నారు. ఇప్పటికీ అనేక అంశాలలో పరోక్షంగా సహకరించిన ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారనున్నారు. త్వరలోనే [more]
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరమవుతున్నారు. ఇప్పటికీ అనేక అంశాలలో పరోక్షంగా సహకరించిన ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారనున్నారు. త్వరలోనే [more]
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరమవుతున్నారు. ఇప్పటికీ అనేక అంశాలలో పరోక్షంగా సహకరించిన ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారనున్నారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. ఇప్పటికే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధాన్ని మొదలుపెట్టారు. నిత్యం విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్….
ఎన్నికలకు ముందు ఇది మామూలేనని బీజేపీ నేతలు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఇలానే చేశారంటున్నారు. అందుకే తాము భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబు ఇలానే చేశారన్న సంగతిని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలనగా ఏడాది ముందు ఆయన కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా తప్పుకున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే వైసీపీ….
ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ సయితం వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీకి ప్రత్యక్ష పోరాటానికి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలపై జగన్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసిందనే చెప్పాలి. మంత్రి కొడాలి నాని అయితే బీజేపీని చడా మడా తిట్టేయడం వెనక కూడా జగన్ అంగీకారం ఉండే ఉంటుంది. ప్రస్తుతానికి బీజేపీని మంత్రులే టార్గెట్ చేస్తున్నారు. ఇక రానున్న కాలంలో జగన్ కూడా బీజేపీపై కాలుదువ్వే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రానున్న కాలంలో…..
బీజేపీ మాత్రం తాము వైసీపీ, టీడీపీకి సమదూరం పాటిస్తున్నామని, తాము బలోపేతం కావడమే లక్ష్యమని చెబుతున్నా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశమయింది ఇరు రాష్ట్రాలకు చెందిన జలవివాదాల కోసమే అయినా కేంద్ర రాజకీయాలపై ఇరువురు మధ్య జరిగినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏడాది ముందు ఏపీలోనూ జగన్ బీజేపీతో ఫైటింగ్ కు రెడీ అవుతున్నారనే అనుకోవాలి.