వైఎస్ ఫ్యామిలీ దూకుడు..నందమూరి ఫ్యామిలీలో ఎక్కడ ?
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో దూకుడుగా ముందుకు వచ్చిన మహానటుడు.. ఎన్టీఆర్.. స్థాపించిన టీడీపీ.. ఇప్పుడు ఎక్కడ పరిమితం అయింది.. అంటే.. కేవలం అందరి వేళ్లూ ఏపీవైపే [more]
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో దూకుడుగా ముందుకు వచ్చిన మహానటుడు.. ఎన్టీఆర్.. స్థాపించిన టీడీపీ.. ఇప్పుడు ఎక్కడ పరిమితం అయింది.. అంటే.. కేవలం అందరి వేళ్లూ ఏపీవైపే [more]
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో దూకుడుగా ముందుకు వచ్చిన మహానటుడు.. ఎన్టీఆర్.. స్థాపించిన టీడీపీ.. ఇప్పుడు ఎక్కడ పరిమితం అయింది.. అంటే.. కేవలం అందరి వేళ్లూ ఏపీవైపే చూపిస్తు న్నాయి. నిజానికి ఎన్టీఆర్ ఆశయాన్ని పరిశీలిస్తే.. తెలుగువారు అంటే..కేవలం ఏపీ వారు మాత్రమే కాదు. అటు తెలంగాణ, ఇటు ఏపీలోని ప్రజలు.. తెలుగువారుగా కలసిమెలిసి ఉండాలని.. ఆత్మగౌరవంతో హక్కులు సాధించుకుని జీవించాలని ఆయన అభిలషించారు. అయితే.. రాష్ట్రం విడిపోయింది. దీనికి కారణాలు అనేకం కావొచ్చు. అయినంత మాత్రాన ఎన్టీఆర్ ఆశయం భ్రష్టుపట్టాల్సిన అవసరం లేదు. అంతలా తెలుగు ప్రజల హృదయాల్లోకి టీడీపీని ఎన్టీఆర్ తీసుకువెళ్లారు.
కనీసం రెండువేల ఓట్లు…..
అంటే.. తెలంగాణలోనూ టీడీపీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆదిలో చంద్రబాబు ఇలానే ఆలోచించారు. తెలంగాణలోనూ టీడీపీ సైకిల్ తిరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే.. కారణాలు ఏవైనా కూడా ఆయన పార్టీని నిలబెట్టుకోలేక పోయారు. ఏపీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన సాగర్ ఉప ఎన్నికలో కూడా టీడీపీ పోటీ చేసినా.. కనీసం 2000 ఓట్లు కూడా పడలేదని రిజల్ట్ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఇక ఎన్టీఆర్ ఆశయం ఎలా నిలుస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు.. దివంగత వైఎస్ కూడా రెండు రాష్ట్రాల్లోని ప్రజలు కలిసి మెలిసి ఉండాలనే ఆకాంక్షించారు.
షర్మిల అయితే…?
విడిపోతే.. ప్రమాదమని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే.. వివిధ కారణాలతో తెలంగాణ ఏర్పడింది. దీంతో ఆయన కుమారుడు జగన్ పెట్టుకున్న పార్టీ ఏపీకే పరిమితమైంది. నిజానికి ఇక్కడ అటు ఎన్టీఆర్‌కు, ఇటు వైఎస్‌కు కూడా వీరాభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయినా.. వైఎస్ హఠాన్మరణం చెందినా.. కూడా పెద్ద ఎత్తున ప్రజలు విలవిల్లాడిపోాయరు. ఏపీతో సమానంగా తెలంగాణలో కూడా! అయితే.. జగన్ వదిలేసిన తెలంగాణలో ఆయన సోదరి షర్మిల జండా పాతేందుకు, వైఎస్‌ను పట్టుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అక్కడ కొత్త పార్టీ పెడతానని ప్రకటన చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించేశారు.ఆమె పార్టీ ప్రకటనకు కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
నందమూరి కుటుంబం మాత్రం….
అయితే.. అదే సమయంలో నందమూరి కుటుంబం ఈ మాత్రం సాహసం చేయలేక పోతోంది. చంద్రబాబు ఇక్కడ సక్సెస్ కాలేదని తెలిసినప్పటికీ.. ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన అనేక మంది నాయకులు.. లేదా హీరోలు కూడా టీడీపీని ఇక్కడ బలోపేతం చేసేందుకు ఎన్టీఆర్ ఫొటోతో రాజకీయాలు చేసేందుకు ముందుకు రాలేక పోతుండడం గమనార్హం. చంద్రబాబు తన అవసరాలకు నందమూరి ఫ్యామిలీని బయటకు లాగి వదిలి వేస్తున్నారే తప్ప నందమూరి వారసులు ఎవ్వరూ స్వతంత్య్రంగా రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు ఇక నందమూరి ఫ్యామిలీ క్రేజ్, చరిత్ర గతం గతః అని… వీళ్లలో ఒక్కరు కూడా డేర్ చేసే పరిస్థితి లేదని చర్చించుకుంటున్నారు.