నాదెండ్ల…. చంద్రబాబు మధ్యలో ఆయన కూడా … ?
ఎన్టీయార్ మీద రెండు సార్లు వెన్నుపోట్లు జరిగాయని తెలుగు రాజకీయ చరిత్ర చెబుతుంది. కానీ మూడవ కంటికి తెలియని మూడవ వెన్నుపోటుకు విఫల యత్నం ఒకటి జరిగిందిట. [more]
ఎన్టీయార్ మీద రెండు సార్లు వెన్నుపోట్లు జరిగాయని తెలుగు రాజకీయ చరిత్ర చెబుతుంది. కానీ మూడవ కంటికి తెలియని మూడవ వెన్నుపోటుకు విఫల యత్నం ఒకటి జరిగిందిట. [more]
ఎన్టీయార్ మీద రెండు సార్లు వెన్నుపోట్లు జరిగాయని తెలుగు రాజకీయ చరిత్ర చెబుతుంది. కానీ మూడవ కంటికి తెలియని మూడవ వెన్నుపోటుకు విఫల యత్నం ఒకటి జరిగిందిట. ఆ ముచ్చటను ఎన్టీయార్ పెద్దల్లుడు దాదాపు 32 ఏళ్ల తరువాత తాజాగా చెప్పుకొచ్చారు. మరి ఆ వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటే తెలుగు మీడియాలో అగ్రగణ్యుడైన ఒక పత్రికాధిపతి అని ఆయన చెబుతున్నారు. ఆ పత్రికాధిపతి ఎన్టీయార్ కి తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలి రోజుల నుంచి మద్దతుగా ఉన్నారని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆ తరువాత కాలంలో రామారావుతో ఆయనకు వ్యవహారం చెడిందట. ఫలితంగా 1989లో ఆయన్ని దించేసేందుకు అతి పెద్ద స్కెచ్ వేసి చివరకు విఫలం అయ్యారని దగ్గుబాటి తన ఫేస్ బుక్ పేజీలో తాజాగా రాసుకొచ్చారు.
అక్కడే అలా :
ఎన్టీయార్ ఉత్తమ పరిపాలకుడు అని ఎవరూ చెప్పలేదు. ఆయన పరిపాలనలోనూ అనేక తప్పులు జరిగాయి. షరా మామూలుగానే అవినీతి, బంధుప్రీతి వంటివి కూడా ఆయన ఏలుబడిలోనూ కొనసాగాయి. ఇక ఎన్టీయార్ తాను అనుకున్నట్లుగానే పాలన సాగాలని భావించడంతో మంత్రులతో కూడా ఆయనకు కొంత ఎడం ఏర్పడింది అన్నది 1985 నుంచి 1989 మధ్యలో జరిగిన కధగా చెబుతారు. ఇదే సమయంలో ఆ పత్రికాధిపతితో కూడా ఎన్టీయార్ కి ఏర్పడిన విభేదాలు చివరకు క్లైమాక్స్ కి చేరుకున్నాయట. మొత్తానికి ఒకేసారి 30 మంది మంత్రులను తన క్యాబినెట్ నుంచి ఎన్టీయార్ తొలగించిన తరువాత అసంతృప్తి తారస్థాయికి చేరడంతో ఆ పత్రికాధిపతి స్వయంగా రంగంలోకి దిగి ఎన్టీయార్ మీద తిరుగుబాటు చేయమని ప్రోత్సహించారట. ఈ విషయంలో తాను ప్రత్యక్ష సాక్షిని అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటున్నారు.
వ్యతిరేక కధనాలతో :
ఎన్టీయార్ మీద వెన్నుపోటుకు తెర వెనక మొత్తం స్కెచ్ ని వెసిన ఆ పత్రికాధిపతి ఎన్టీయార్ వ్యతిరేక సంపాదకీయాలతో టీడీపీలో ముసలానికి అగ్గి రగిల్చారు అన్నది కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోపణ. ఆ సమయంలో తాను రంగంలోకి దిగి మొత్తం ఎమ్మెల్యేలను ఒక త్రాటిపైకి తీసుకువచ్చానని ఆయన చెప్పుకున్నారు. అలాగే ఎన్టీయార్ పట్ల టీడీపీ ఎమ్మెల్యేలు విధేయత చూపేలా మొత్తం తాను చక్రం తిప్పి ఆ భారీ వెన్నుపోటు ఆపరేషన్ ని తిప్పికొట్టానని దగ్గుబాటి పేర్కొన్నారు. తాను చెప్పిన అన్ని విషయాలు నిజమేనని, దానికి ఇప్పటికీ బతికి ఉన్న ఆ పత్రికాధిపతే సాక్ష్యమని దగ్గుబాటి అంటున్నారు.
అలా సక్సెస్ :
ఇక 1989లో ఫెయిల్ అయిన ఆపరేషన్ ని 1995లో మాత్రం చాలా పక్కాగా ఆ పత్రికాధిపతి సక్సెస్ చేసుకున్నారని, ఆయన చంద్రబాబుకు పూర్తి మద్దతు ఇచ్చి మరీ ఎన్టీయార్ ని గద్దె దింపి తన ఇగోను చల్లార్చుకున్నారని కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. 1995లో వెన్నుపోటు విజయవంతం కావడానికి ఆ పత్రికాధిపతికి అనేక అంశాలు కూడా దోహదపడ్డాయని కూడా దగ్గుబాటి చెప్పారు. మొత్తానికి తోడల్లుడి మాటల్లో చెప్పాలంటే 1995లో జరిగిన ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ లో అసలు విలన్ చంద్రబాబు కాదుట, ఆ పత్రికాధిపతేనట. అంటే నాదెండ్ల, చంద్రబాబు మధ్యలో ఈయన కూడా ఉన్నారన్న మాటేగా.