అది సాధ్యం కాదేమో…..!!
భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే [more]
భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే [more]
భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం ఉంది. అదే భిన్నత్వంలో ఏకత్వం. మా భాషలను, ప్రాంతాలను గౌరవించుకుంటూనే దేశం దాకా వస్తే ఒక్కటిగా ఉంటామని చెప్పే అందమైన సందేశం భారత్ కే సొంతం. ఇది ఈనాటికి కాదు, యుగయుగాలుగా కోసాగుతూ వస్తోంది. మరి ఒక దేశంలో ఎన్నో పార్టీలు ఉంటాయి. బోలెడు రాజకీయం ఉంటుంది. అటువంటిది ఒకే పార్టీగా మార్చడం సాధ్యమా.
కాంగ్రెస్ మాదిరిగా….
దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ పాలన చేస్తూ వచ్చింది. దేశ స్వాతంత్రం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఆ గౌరవాన్ని జనం ఇచ్చారు. అయితే రాను రాను కాంగ్రెస్ నాయకత్వం నియంత పోకడలు పోవడం రాష్ట్రాలను తమ ఆధీనంలో నడిచే కట్టు బానిసలుగా చూడడంతో తిరుగుబాటు మొదలైంది అది చివరికి ప్రాంతీయ తత్వానికి దారి తీసి ఏ భాషకు ఆ భాషవారు తమదైన రాజకీయాన్ని రాష్ట్రాల వరకూ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ రాష్ట్రాలని ఇబ్బంది పెట్టే కొత్త కుట్రలకు కేంద్రంలోకి కాంగ్రెస్ ప్రయత్నించడంతో ఇలా కాదు కేంద్రంలోని కాంగ్రెస్ నే దించేస్తే పోలా అని నిర్ణయానికి వచ్చిన ప్రాంతీయ శక్తులు ఎన్నో ప్రయోగాల అనంతరం ఆ పనిని విజయవంతగా చేశాయి. అయితే కాంగ్రెస్ తో పాటు మరో జాతీయ పార్టీ వుంది. బీజేపే ఇపుడు ఆ స్థానాన్ని తీసుకోవాలనుకుంటోంది.
జనసంఘ్ కాలం నుంచి….
ఇక బీజేపీ ప్రస్తానం అంతా దేశ భక్తి, కాశ్మీర్, అయోధ్య వంటి వాటి మీదుగా తిరుగుతూ వచ్చింది. 1950 ప్రాంతాల్లో ఏర్పాటైన జనసంఘ్ హిందీ బెల్ట్ లో కొంత ప్రాబల్యం చూపించింది. 1977లో కేంద్రంలో ఏర్పాటు అయిన జనత ప్రభుత్వంలో జనసంఘ్ కీలక పాత్ర పోషించింది. అది పతనం అయ్యాక బీజేపీగా రూపు మార్చుకుంది వాజ్ పేయ్ అద్వాని నాయకత్వమో ఈ దేశానికి మూడు సార్లు అధికారంలోకి వచ్చి సేవలు అందించింది. ఇక మోడీ, అమిత్ షా హయాంలో దాన్ని మించి విజయాలు బీజేపీ నమోదు చేస్తూ వస్తోంది.
ఇక ఒకే పార్టీయా….?
దాంతో ఓ వైపు కాంగ్రెస్ పతనం కావడం, మరో వైపు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మరడంతో బీజేపీకి ఇపుడు దేశంలో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తాజా ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన బీజేపీ ఇక 2047 వరకూ అంటే దేశానికి వందేళ్ళ స్వాతంత్రం నాటికి బీజేపీ జెండా ఎర్ర కోట మీద సంపూర్ణంగా ఎగిరేలా సుస్థిరంగా, శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటోంది. దాని కోసం ఎత్తుకున్న నినాదమే ఒకే దేశం ఒకే ఎన్నికలు. దానికి ముందు ఇపుడు ఒకే దేశం, ఒకే భాష అన్నారు. అదే హిందీ భాష. ఇక ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ అంటున్నారు. ఒకే దేశం ఒకే వెహికిల్ లైసెన్స్ అంటున్నారు. ఇలా దేశం మొత్తాన్ని ఒక చట్రంలో బంధించడం ద్వారా తమ కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం బీజేపీ ఒకే దేశం, ఒకే పార్టీ ఉండాలని కోరుకుంటోంది. మరి ఇది నెరవేరడం అన్నది అసాధ్యమనీ చెప్పలేం, అలాగనీ సాధ్యపడుతుందనీ అనలేం. చూడాలి.
- Tags
- akhilesh yadav
- amith shah
- bahujan samaj party
- bharathiya janatha party
- india
- indian national congress
- mayavathi
- narendra modi
- rahul gandhi
- samajwadi party
- à° à°à°¿à°²à±à°·à± యాదవà±
- ఠమితౠషా
- నరà±à°à°¦à±à°°à°®à±à°¦à±
- బహà±à°à°¨à± సమాà°à± పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤ à°¦à±à°¶à°®à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- మాయావతి
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సమాà°à± వాదౠపారà±à°à±