మరో ఆప్షన్ లేదా? లిక్కర్ తో ఆ లోటు తీరుతుందా?
మద్యం దుకాణాలు తెరవడం ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రగిల్చింది. నేటి నుంచి మద్యం దుకాణాలు ఏపీలో తెరుచుకున్నాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. అర్జెంట్ [more]
మద్యం దుకాణాలు తెరవడం ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రగిల్చింది. నేటి నుంచి మద్యం దుకాణాలు ఏపీలో తెరుచుకున్నాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. అర్జెంట్ [more]
మద్యం దుకాణాలు తెరవడం ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రగిల్చింది. నేటి నుంచి మద్యం దుకాణాలు ఏపీలో తెరుచుకున్నాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. అర్జెంట్ ఆదాయం కోసం ప్రభుత్వం వెంపర్లాడుతుందని అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి. మద్యం దుకాణాలు తెరుచుకుంటే భౌతిక దూరం పాటించరని, తద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది విపక్షాల ఆందోళన అందులో కొంత నిజం లేకపోలేదు.
హెచ్చరికలు చేస్తూనే….
అయితే ప్రభుత్వం కూడా హెచ్చరికలతో మద్యం దుకాణాలను తెరిచింది. ఏమాత్రం నిబంధలను మద్యం దుకాణాల వద్ద ఉల్లంఘిస్తే ఆ దుకాణాలను మూసి వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. గత నలభై రోజులుగా మద్యం దుకాణాలు ఏపీలో లేవు. దీంతో మందుబాబులు కూడా సాధారణ జీవనానికి అలవాటుపడ్డారు. కొందరు తొలినాళ్లలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినా కొన్ని రోజులుకు కదుటపడ్డారు. ఇప్పడు మద్యం దుకాణాలు ఓపెన్ కావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పేద, మధ్య తరగతి ప్రజలు….
అసలే గత రెండు నెలలుగా ఉపాధి లేదు. వేతనాలు లేవు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరుచుకుంటే అప్పులు చేసి మరీ వెళతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మద్యనిషేధం అమలు పరుస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ వేళ వాటిని తెరవడమేంటన్న ప్రశ్న ఉత్పన్న మవుతుంది. ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారింది. ముఖ్యంగా మహిళలు, మధ్యతరగతి ప్రజల నుంచి ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.
ఆదాయం లేకపోవడంతోనే…?
కానీ ప్రభుత్వం వద్ద మరో ఆప్షన్ లేదు. మద్యం దుకాణాలు తెరవకుంటే ఆదాయం రాదు. ఇప్పటికే ఖాజానా బోసిపోయి ఉంది. రెండు నెలలుగా ఆదాయం లేకపోవడంతో ఉద్యోగుల జీతభత్యాల్లో కూడా కోత విధించారు. ఆదాయం వస్తుందన్న ఆలోచనతోనే ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవాల్సి వచ్చిందన్నది వాస్తవం. అందుకే మద్యం ధరలను కూడా పెంచామంటుంది. కొనుగోలు శక్తి ఉన్నవారే దుకాణాలకు వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వంపై సహజంగానే మద్యం దుకాణాలను తెరవడంపై అసంతృప్తి తలెత్తే అవకాశముంది. మరి పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి లేని సమయంలో తెరుచుకుంటున్న మద్యం దుకాణాల వల్ల ఎంత మేర ఆదాయం ప్రభుత్వానికి వస్తుందనేది చూడాల్సి ఉంది.