మూడ్ వచ్చేసినా… మూడంకె వేసేస్తే ఎలా?
ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీహార్ లో విపక్షాలు డీలా పడ్డాయి. విపక్షాల మధ్య సఖ్యత కొరవడటం బీజేపీ కూటమికి లాభించే అంశంగా చెబుతున్నారు. బీహార్ లో ఈ [more]
ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీహార్ లో విపక్షాలు డీలా పడ్డాయి. విపక్షాల మధ్య సఖ్యత కొరవడటం బీజేపీ కూటమికి లాభించే అంశంగా చెబుతున్నారు. బీహార్ లో ఈ [more]
ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీహార్ లో విపక్షాలు డీలా పడ్డాయి. విపక్షాల మధ్య సఖ్యత కొరవడటం బీజేపీ కూటమికి లాభించే అంశంగా చెబుతున్నారు. బీహార్ లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తుంది. పోలింగ్, ప్రచారసరళిని ఎలా నిర్వహించాలన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల కమిషన్ తీసుకుంది. అంటే బీహార్ లో ఒకరకంగా ఎన్నికల మూడ్ వచ్చేసినట్లే.
ఈ ఏడాది ఎన్నికలు….
కరోనా వ్యాప్తి కారణంగా బీహార్ లో ఎన్నికలు సకాలంలో జరుగుతాయా? లేదా? అన్న దానికి ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే బీహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ యు, బీజేపీ కూటమి ప్రచారాన్ని ప్రారంభించాయి. వర్చువల్ మీటింగ్ లను నిర్వహిస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నూరిపోస్తున్నాయి. మరోవైపు రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. సీట్ల పంపకమే ఇక మిగిలింది. ఇది కూడా త్వరలోనే తేలిపోతుందంటున్నారు.
విపక్షాలు మాత్రం…..
అధికార పార్టీ ఇలా ఉంటే విపక్షాలు మాత్రం డీలా పడ్డాయనే చెప్పాలి. ప్రధాన విపక్షమైన ఆర్జేడీ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతుంది. తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ల మధ్య పొసగడం లేదు. ఇద్దరూ నియోజకవర్గాలను పంచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రబ్రీదేవి ఇద్దరి మధ్య చేసిన సయోధ్య ప్రయత్నాలు ఫలించడం లేదంటారు. మరోవైపు విపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఆ కూటమిలో చేరేందుకు సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఐక్యత లేక……
హిందుస్థాన్ ఆవామీ మోర్చా పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ సయితం పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆర్జేడీ నుంచి కూడా నేతలు అధికార పార్టీ వైపు వెళుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు జేడీయూలో చేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీహార్ లో బీజేపీ కూటమి పుంజుకుంటుండగా, విపక్షాలు మాత్రం ఐక్యత లేక కూనిపాట్లు పడుతున్నాయి. వీరి ఆశంతా ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు అందివస్తుందని. ఏం జరుగుతుందో చూడాలి.