ఎందుకిలా జరగుతోంది..? ఇక ఏమీ చేయలేమా?
ఏపీ, తెలంగాణల్లో రాజకీయాలు వేడెక్కాయి. అసలు రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హాట్ హాట్‌గా సాగుతాయనుకోండి. కానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత వేడెక్కాయి. తెలంగాణలోను, ఏపీలోను.. [more]
ఏపీ, తెలంగాణల్లో రాజకీయాలు వేడెక్కాయి. అసలు రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హాట్ హాట్‌గా సాగుతాయనుకోండి. కానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత వేడెక్కాయి. తెలంగాణలోను, ఏపీలోను.. [more]
ఏపీ, తెలంగాణల్లో రాజకీయాలు వేడెక్కాయి. అసలు రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హాట్ హాట్‌గా సాగుతాయనుకోండి. కానీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత వేడెక్కాయి. తెలంగాణలోను, ఏపీలోను.. సంపూర్ణ మెజారిటీతో కూడిన బలమైన ప్రభుత్వాలు ఉండడం, అత్యంత వీకైన ప్రతిపక్షాలు ఉండడం మనకు కనిపిస్తున్న విషయం. అంత మాత్రాన విపక్షాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 మందితో కాంగ్రెస్ విపక్ష పాత్ర పోషించి .. తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి.. విపక్షాలకు బలం కన్నా.. గళమే ప్రధానం.
తెలంగాణాలో విపక్షాలు….
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. అక్కడ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పోరాడుతోంది. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సిన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా.. హైకోర్టు ఆదేశాలతో ఇచ్చారనుకోండి. ఇక, కరోనా విషయంలో కేసీఆర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీతో చేతులు కలుపుతున్నారని, గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో జాప్యం చేస్తున్నారని, అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలన్నీ హైకోర్టు కొట్టేస్తోందని ఇలా అనేక ఆరోపణలతో వీధిలోకి ఎక్కారు. సహజంగానే ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో వారిని అనుమతించలేదు.
ప్రభుత్వంపై పైచేయి సాధించాలని….
ఇక, ఏపీ విషయానికి వస్తే.. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం దూకుడుగా తీసుకున్న నిర్ణయాలను దొడ్డి దారుల్లో తన వ్యక్తులను పెట్టి కోర్టుల్లో న్యాయ పోరాటం చేయించిన చంద్రబాబుకు ఇప్పుడు నేరుగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఊపిరి ఆడడం లేదు. పార్టీ ముఖ్య నేతలు అరెస్టయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నిరసనల పిలుపునకు ఎవరూ స్పందించలేదు. దీంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి చూస్తే.. ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల కంటే.. కూడా స్వప్రయోజనాలను, ప్రభుత్వంపై పైచేయి సాధించాలనే ఆరాటం స్పష్టంగా కనిపించింది.
రెండు రాష్ట్రాల్లోనూ…..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు తమ నేతలను నమ్మడం లేదు. ఏపీలో టీడీపీ నేతలు చంద్రబాబును నమ్మడం లేదు. ఇక్కడ ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేక అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలపై, ఆ పార్టీపై నమ్మకం లేని వాళ్లు బీజేపీ, టీఆర్ఎస్లోకి వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాల కారణంగానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాల్లో తీవ్రమైన అలజడి నెలకొందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితి పోవాలంటే.. ప్రతిపక్షాలు ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉందే .. తప్ప.. తమ వ్యక్తిగత అజెండాలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తే.. ఇలానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.