నెల్లూరు పెద్దారెడ్ల కోపం మామూలుగా లేదే ?
తెలుగు రాజకీయాల్లో రెడ్ల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగైదు దశాబ్దాలుగా రెడ్డి నేతలు అనేక పార్టీల్లో పాతకు పోయారు. గతంలో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్న రెడ్లు [more]
తెలుగు రాజకీయాల్లో రెడ్ల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగైదు దశాబ్దాలుగా రెడ్డి నేతలు అనేక పార్టీల్లో పాతకు పోయారు. గతంలో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్న రెడ్లు [more]
తెలుగు రాజకీయాల్లో రెడ్ల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగైదు దశాబ్దాలుగా రెడ్డి నేతలు అనేక పార్టీల్లో పాతకు పోయారు. గతంలో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్న రెడ్లు ఇప్పుడు వైసీపీని తమ సొంత పార్టీగా భావిస్తున్నారు. జగన్‌ను సీఎంను చేసుకునేందుకు నెల్లూరు, సీమ రెడ్లు పదేళ్లుగా ఎంతో కష్టపడిన మాట వాస్తవం. ఎంతో మంది రెడ్డి నేతలు కాంగ్రెస్, టీడీపీ నుంచి బయటకు వచ్చి మరి వైసీపీలో చేరారు. ఏడెనిమిదేళ్ల కష్టానికి ఫలితం దక్కడంతో పాటు జగన్ సీఎం అయ్యారు. వాళ్లంతా రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే వీరి ఆనందం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలలకే ఆవిరైపోయింది. ఏదో చేద్దాం.. ఏదో సాధిద్దాం.. ఏదో మంచి పదవి పొందేద్దాం అని ఆశపడ్డ వీరి ఆశలు అడియాసలు అయ్యాయి.
జూనియర్లకే అవకాశం…?
పార్టీలో ఎంతో సీనియర్లుగా ఉన్నా..వీరికి ప్రత్యేక గుర్తింపు లేదు. ఇంకా చెప్పాలంటే వీరికంటే జూనియర్లు.. సబ్ జూనియర్లు పదవులు కొట్టేస్తున్నా ఈ రెడ్డి నేతల బాధలు పట్టించుకునే వారే లేరు. అదేమని ప్రశ్నించినా.. నెత్తి నోరు మొత్తుకుని సీనియార్టీ గురించి చెప్పుకున్నా పార్టీ మనదే కాదా ?మనకు అడ్డేముందని చెపుతున్నారే తప్ప రెడ్డి నేతలకు పదవులు లేవు.. పనులు లేవు.. గుర్తింపు లేదు. పైకి మాటగా చెప్పుకోవడానికి.. ఊరడింపుకు మాత్రమే అంతా మనమే అంటున్నారట. ఇక మిగిలిన రెడ్లు వేరు.. నెల్లూరు జిల్లా రెడ్లు వేరు. వీరికి ఏ పార్టీ ఉన్నా పెత్తనం ఉండాలి.
వారిదే పెత్తనం….
ప్రస్తుతం నెల్లూరు ఎంపీతో పాటు రిజర్వ్డ్ నియోజకవర్గాలు, మంత్రి అనిల్‌ను వదిలేస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా సీనియర్లే. అయితే జిల్లాలో వీరిని కాదని బీసీ వర్గానికి చెందిన మంత్రి అనిల్ పెత్తనం నడుస్తోంది. పైగా జగన్ దగ్గర అనిల్‌కు మంచి మార్కులు ఉన్నాయి. ఎన్నిసార్లు ఈ రెడ్డి నేతలు మొర పెట్టుకున్నా జగన్ మాత్రం అనిల్‌కే భుజం కాస్తూ వచ్చారు. దీంతో వీరంతా రగులుతూ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక బాధ్యతలను జగన్ పెద్దిరెడ్డి, అనిల్‌కు పూర్తిగా అప్పగించేశారు.
నాలుగు సెగ్మంట్లలో….
తిరుపతి పార్లమెంటు పరిధిలోకి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. వీటిల్లో గూడూరు సూళ్లూరుపేట తప్ప.. వెంకటగిరి సర్వేపల్లి జనరల్ నియోజకవర్గాలు. ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాల్లోనూ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు రెడ్డి ప్రజా ప్రతినిధులతో పాటు పెద్దారెడ్డి సంఘం నేతలు అందరూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ తిరుపతి ఉప ఎన్నికల వేళ పార్టీలో సెగలు రేపుతున్నారు. వీరి అసమ్మతి ఉప ఎన్నిక వేళ ఎక్కడ పార్టీ కొంప ముంచుతుందో అని గ్రహించిన అధిష్టానం… ఉప ఎన్నిక తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చెపుతున్నా వారు నమ్మడం లేదట. మరి వీరి అసమ్మతి పార్టీలో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో ? ఫలితాల తర్వాత చూడాలి.