తమిళనాడు తీరు మార్చుకోవాల్సిందేనా?
తమిళనాడు ను ఇతర రాష్ట్రాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. పొరుగు రాష్ట్రాలతోన తమిళనాడు ప్రభుత్వం వివాదాలకు దిగడం ఇందుకు కారణం. మరోవైపు తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ [more]
తమిళనాడు ను ఇతర రాష్ట్రాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. పొరుగు రాష్ట్రాలతోన తమిళనాడు ప్రభుత్వం వివాదాలకు దిగడం ఇందుకు కారణం. మరోవైపు తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ [more]
తమిళనాడు ను ఇతర రాష్ట్రాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. పొరుగు రాష్ట్రాలతోన తమిళనాడు ప్రభుత్వం వివాదాలకు దిగడం ఇందుకు కారణం. మరోవైపు తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరగుతున్నాయి. ఇప్పటికే తమిళానాడులో కరోనా వైరస్ పాజటివ్ కేసుల సంఖ్య పద్నాలుగు వేలకు చేరువలో ఉంది. మృతుల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నా పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఇతర రాష్ట్రాల వారిని…..
ఇతర రాష్ట్రాల వారిని తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సొంత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడం లేదు. కరోనా వైరస్ సోకినా నెగిటివ్ రాకుండానే నాలుగు రోజులు ఉంచి ఇతర రాష్ట్రాల వారిని ఆసుపత్రి నుంచి పంపించి వేస్తున్నారు. ఇది ఇతర రాష్ట్రాలకు ముప్పుగా మారింది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాలు తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు.
వలస కార్మికుల విషయంలో…
ఇక వలస కార్మికలకు సరైన భోజన, వసతి కల్పించడంలోనూ తమిళనాడు ప్రభుత్వం విఫలమయింది. అనేక మంది వలస కార్మికులు తమిళనాడులో ఉండలేక రోడ్డున పడ్డారు. వేల కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. వీరికి ఇతర రాష్ట్రాలు వసతి కల్పించాల్సి వస్తుంది. ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు ఇతరరాష్ట్రాల సరిహద్దుల్లో రోడ్లను తవ్వి తమిళనాడు ప్రభుత్వం వివాదాలకు తెరతీసింది.
ప్రజా రవాణా వ్యవస్థకు….
ఇప్పడు తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కోయంబేడు మార్కెట్ నుంచి అనేక రాష్ట్రాలకు ఈ వ్యాధి అంటుకుంది. అందుకే ఏ రాష్ట్రమూ ఇప్పుడు తమిళనాడుకు ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు అంగీకరించడం లేదు. అక్కడ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం, పళనిస్వామి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇందుకు కారణమని చెప్పకతప్పదు. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లు సయితం తమిళనాడు ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నాయంటున్నారు. మరి తమిళనాడు ఇప్పటికైనా తన తీరును మార్చుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.