Koushik reddy : అప్పటి వరకూ ఆగాల్సిందేనా?
దేవుడు వరమిచ్చినా పూజారి అన్న సామెత హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి విషయంలో నిజమవుతుంది. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఇప్పుడు జరిగే శాసనమండలి [more]
దేవుడు వరమిచ్చినా పూజారి అన్న సామెత హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి విషయంలో నిజమవుతుంది. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఇప్పుడు జరిగే శాసనమండలి [more]
దేవుడు వరమిచ్చినా పూజారి అన్న సామెత హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి విషయంలో నిజమవుతుంది. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఇప్పుడు జరిగే శాసనమండలి సమావేశాలకు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ హోదాలో హాజరుకావాల్సి ఉంది. కానీ గవర్నర్ ఆమోదం తెలపక పోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. గవర్నర్ ఎప్పుడు ఆమోద ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల వరకూ ఎమ్మెల్సీ పదవి దక్కించుకునే అవకాశం పాడి కౌశిక్ రెడ్డికి లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
చేరిన వెంటనే…
పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ పై ఆరోపణలు రాగానే తొలుత స్పందించింది ఈయనే. అప్పుడే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఈటల రాజేందర్ కులంపైన కూడా ఆయన చేసిన సవాళ్లు, బీసీ కార్డును ఈటల ఏవిధంగా ఉపయోగించుకుందీ తదితర వివరాలను పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టారు. దీంతో ఆయనను కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
మంత్రివర్గం ఆమోదించినా…
టీఆర్ఎస్ లో చేర్చుకున్న వెంటనే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించి మరీ పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే ప్రతిపాదనపై మంత్రి వర్గం సయితం ఆమోదించింది. అయితే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాత్రం ఇంతవరకూ ఈ ఫైలును ఆమోదించ లేదు. తనకు కొన్ని అనుమానాలున్నాయని గవర్నర్ చెబుతున్నారు.
గవర్నర్ వద్దనే….
సేవా కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును పంపడంతో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసేంత వరకూ ఈ ఫైల్ ను హోల్డ్ లో పెట్టాలని గవర్నర్ భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఫైలును హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదని కూడా గవర్నర్ చెబుతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ కౌశిక్ రెడ్డి పేరును ఎంపిక చేసినా ఫలితం లేకుండా పోతుంది. మరి ఎన్నాళ్లు ఆగాలన్నది వేచి చూడాల్సిందే.