రాంగ్ కాల్ ఎంతపని చేసింది …?
ఒక ప్రేమ కథ కేంద్ర ప్రభుత్వాన్నే తలపట్టుకునేలా చేసింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా భావించిన ఒక వ్యక్తి పాక్ పౌరుడే కానీ ప్రేమికుడిగా గుర్తించిన పోలీసులు సైతం [more]
ఒక ప్రేమ కథ కేంద్ర ప్రభుత్వాన్నే తలపట్టుకునేలా చేసింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా భావించిన ఒక వ్యక్తి పాక్ పౌరుడే కానీ ప్రేమికుడిగా గుర్తించిన పోలీసులు సైతం [more]
ఒక ప్రేమ కథ కేంద్ర ప్రభుత్వాన్నే తలపట్టుకునేలా చేసింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా భావించిన ఒక వ్యక్తి పాక్ పౌరుడే కానీ ప్రేమికుడిగా గుర్తించిన పోలీసులు సైతం కేసు మొత్తం శోధించిన తరువాత అవాక్కయ్యారు. ఇదంతా కర్నూలు జిల్లా గడివేముల ప్రాంతానికి చెందిన దౌలత్ సౌదీ అరేబియా లో ఉద్యోగం చేస్తున్న పాకిస్తానీ గుల్జార్ ఖాన్ ఒక రాంగ్ నెంబర్ లో దౌలత్ పరిచయం ప్రేమ గా మారింది. అప్పటికే భర్త చనిపోయి ఒంటరిగా వున్న దౌలత్, గుల్జార్ తో పీకల్లోతు లవ్ లో పడిపోయింది. ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితుల్లో గుల్జార్ సౌదీ నుంచి నేరుగా ఇండియా వచ్చేశాడు.
ఇండియా ఇలా వచ్చేశాడు ….
ఇలా రావడానికి అతడు చాలా కష్టపడాలిసి వచ్చింది. తాను ఇండియన్ నని పాస్ పోర్ట్ పోయిందంటూ సౌదీ లోని ఇండియన్ అంబాసిని ఆశ్రయించి భారత్ కు వచ్చేశాడు. నేరుగా తన ప్రేయసి ఊరు గడివేముల వచ్చేయడం వెంటనే వివాహం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. వీరి దాంపత్యానికి నలుగురు సంతానం కూడా కలిగారు. ఇక్కడిదాకా కథ బాగానే నడిచింది. అయితే కొంతకాలంగా పాకిస్తాన్ లోని తన బంధువులు గుర్తొచ్చి ఇంటికి కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. అదే అతని వ్యవహారాన్ని బయట పెట్టేలా చేస్తుందని గుల్జార్ భావించలేదు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ కనిపెట్టేసింది …
పాక్ సీమాంతర తీవ్రవాదంపై నిఘా వేసి ఉంచిన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కర్నూలు నుంచి పాకిస్తాన్ లోని సియోల్ కోట్ కి తరచూ కాల్స్ వెళుతున్న అంశాన్ని గమనించింది. దాంతో నిఘా కంటిన్యూ చేసింది. ఇవేమి తెలియని గుల్జార్ కుటుంబం తో సహా పాకిస్తాన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. భార్య దౌలత్ తో సహా పిల్లలకు పాస్ పోర్ట్ సంపాదించి వీసా పై పాక్ వెళ్లేందుకు హైదరాబాద్ లో రైలెక్కిన గుల్జార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరిని పూర్తిగా విచారించిన పోలీసులకు షాక్ తగిలింది.
తీవ్రవాది కాకున్నా……
ప్రేమకు ఎల్లలు లేవు. అతడు తీవ్రవాది కాదు. కానీ భారత చట్టాల ప్రకారం నేరం చేసినట్లే. దాంతో ఏమి చేయాలో తెలియని పోలీసులు గుల్జార్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దౌలత్ ను ఆమె నలుగురు పిల్లల్ని కర్నూలు పంపారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరం గా మారుతుంది. ఒకవేళ గుల్జార్ తో బాటు దౌలత్ ను పిల్లలను పాకిస్తాన్ పంపినా ఆమెకు ఉండేందుకు అక్కడ చట్టాలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో ఇటు భారత సర్కార్ పాక్ సర్కార్ లు ఈ వ్యవహారంపై ఒక పరిష్కారం వెతకాలి మరి.