పళని అంత స్ట్రాంగ్ ఎందుకయ్యారు?
పళనిస్వామి బలహీనమైన నేత కాదు. మూడున్నరేళ్లు ఎటువంటి చరిష్మా లేకుండానే పార్టీని, ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు నడపగలిగారు. తొలినాళ్లలో పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమయినా వాటిని సర్దుబాటు [more]
పళనిస్వామి బలహీనమైన నేత కాదు. మూడున్నరేళ్లు ఎటువంటి చరిష్మా లేకుండానే పార్టీని, ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు నడపగలిగారు. తొలినాళ్లలో పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమయినా వాటిని సర్దుబాటు [more]
పళనిస్వామి బలహీనమైన నేత కాదు. మూడున్నరేళ్లు ఎటువంటి చరిష్మా లేకుండానే పార్టీని, ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు నడపగలిగారు. తొలినాళ్లలో పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమయినా వాటిని సర్దుబాటు చేసుకుంటూ పళనిస్వామి పూర్తికాలం ప్రభుత్వాన్ని నడపగలిగారు. ఇక పాలనలో తనదైన మార్క్ ను కూడా చూపించారు. జయలలిత, కరుణానిధి పాలన చూసిన తర్వాత పళనిస్వామ పాలన ప్రశాంతంగా సాగిందన్నది తమిళుల్లో ఎక్కువమంది అభిప్రాయం.
ఆత్మవిశ్వాసంతో…..
అయితే రేపు జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే పళనిస్వామిలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ సీట్ల సర్దుబాటు. సీట్ల సర్దుబాటు విషయంలో పళనిస్వామి ఎక్కడా రాజీ పడలేదు. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూటమి నుంచి వైదొలుగుతానన్నా పెద్దగా లెక్క చేయలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని కూటముల్లో సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత డీఎండీకే కూటమి నుంచి వైదొలిగింది.
ఎక్కడా రాజీ లేదు….
విజయ్ కాంత్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే అది తమకు ఉపకరిస్తుందని పళనిస్వామి నమ్ముతున్నారు. ఇక బీజేపీ విషయంలోనూ పళనిస్వామి రాజీ పడలేదు. బీజేపీ గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గ లేదు. కేంద్రంలో బలంగా ఉన్నా, మోదీ, అమిత్ షాలు అనేక సార్లు తమిళనాడులో పర్యటించినా ఆ పార్టీకి ఇరవైకి మించి సీట్లను ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే పళనిస్వామి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్నారనే చెప్పుకోవాలి. పన్నీర్ సెల్వం వర్గాన్ని కూడా టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు.
వ్యూహాత్మకంగానే…
పశనిస్వామి తొలి నుంచి వ్యూహాత్మకంగానే ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ పట్టుబట్టినా పళనిస్వామి లెక్క చేయలేదు. దగ్గరుండి మరీ అన్నాడీఎంకే సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. తనకు ప్రత్యర్థిగా ప్రచారంలో ఉన్న పన్నీర్ సెల్వం చేతనే పళనిస్వామి ఆ ప్రకటన చేయించారు. శశికళను పార్టీలో చేర్చుకొమ్మని బీజేపీ నుంచి వత్తిడి వచ్చినా కుదరదు పొమ్మన్నారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల్లో రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయం పక్కన పెడితే పళనిస్వామి మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నారని చెప్పుకోవాలి.