Tue Nov 05 2024 16:17:06 GMT+0000 (Coordinated Universal Time)
పాలేర్ టికెట్ బెంగళూరులో డిక్లేర్ అవుతుందా?
2016 బై ఎలక్షన్లో 45 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తిరిగి అదే వేవ్‌లో గెలుస్తాను అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వర్ రావ్..
2016 బై ఎలక్షన్లో 45 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తిరిగి అదే వేవ్‌లో గెలుస్తాను అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వర్ రావ్..
ఖమ్మంలో తాను ప్రజా ప్రతినిధి.. అందరివాడిని.. అందుకే నన్నే గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్..
రాజన్న రాజ్యం తెస్తాను.. తన తండ్రి ఆశయాలను తిరిగి నెలకొల్పుతాను.. తనను ఆదరించండి అని ముందుకొచ్చారు వైఎస్ షర్మిళ..
ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నా.. అందరికీ ఎదురవుతున్న ప్రధాన సమస్య.. తాము ఆశిస్తోన్న నియోజకవర్గం పాలేర్...
ఒకరేమో ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిళ. ఒకరేమో పాలేర్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన తుమ్మల. మరొకరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజామోదం కలిగిన పొంగులేటి. పాలేర్ టికెట్ కోసం ఈ ముగ్గురూ చేస్తున్న ప్రయత్నాలు.. ఆ నియోజకవర్గాన్ని రాష్ట్ర కేంద్రబిందువుగా రూపుమాపాయి.
వైఎస్ షర్మిళ ఢిల్లీకి వెళ్ళి సోనియా రాహుల్ గాంధీలతో మంతనాలు జరిపితే.. రేవంత్ రెడ్డి వెనువెంటనే తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఇంతకుముందు నెలరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆశావహుడిగా ఉన్న పొంగులేటికి ఈ రెండు సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. తను పార్టీలో చేరినప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రభంజనం లాంటి వేడుక నిర్వహించిన పొంగులేటి.. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు.
తుమ్మలకు టికెట్ ఇవ్వాలని రేవంత్ ఏకంగా బెంగళూరుకు వెళ్ళి డికే శివకుమార్‌ని కలిసారు. డీకే శివకుమార్, వైఎస్ షర్మిళ కుటుంబాలు రాజకీయాలకు అతీతంగా స్నేహితులు. షర్మళ డీకేని ఇటీవల కాలంలో పలుమార్లు కలిసారు. పాలేర్ టికెట్ కోసం ఆమె ప్రతిపాదించారు కూడా.
దీంతో పాలేర్ డిక్లరేషన్ బెంగళూరు టేబుల్ మీదకి చేరింది. ఈ ముగ్గురే కాకుండా ఇంతకుముందు నుంచి కూడా పాలేర్ కాంగ్రెస్ టికెట్‌కు ఎందరో ఆశావహులు ఉన్నారు. వాళ్ళలో గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాయల నాగేశ్వర్ రావ్, మద్ది శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు చరణ్ రెడ్డి, రామసహాయం మాధవి రెడ్డిలు ఉన్నారు. ఈ టికెట్ కోసం రాయల నాగేశ్వర్ రావు మల్లు భట్టి విక్రమార్కను పలుమార్లు ఆశ్రయించారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఏమీ తోచని స్థితికి దిగిపోయారు.
ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే.. సీపీఎమ్ నేత తమ్మినేని వీరభద్రం పాలేర్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ.. 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసినరోజు కేసీఆర్ పొత్తులేమీ ఉండబోవని స్పష్టం చేశారు. సో కమ్యునిస్ట్ పార్టీకి ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తోంది. ఒకవేళ సీపీఎం.. కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నా.. పాలేర్ టికెట్ మాత్రం రేస్‌లో ఉన్న పొంగులేటి, తుమ్మల లేదా షర్మిళలకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు!
Next Story