ఊపున్నా.. పట్టించుకునేవారేరీ.. ఎదురీదుతున్న మాజీ మంత్రి
ఆయన మాజీ మంత్రి. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు కూర్చోమంటే..కూర్చొనే వారు.. నిలబడమంటే.. నిలబడేవారు అంతవీర విధేయత చూపించిన ఆయనే [more]
ఆయన మాజీ మంత్రి. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు కూర్చోమంటే..కూర్చొనే వారు.. నిలబడమంటే.. నిలబడేవారు అంతవీర విధేయత చూపించిన ఆయనే [more]
ఆయన మాజీ మంత్రి. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు కూర్చోమంటే..కూర్చొనే వారు.. నిలబడమంటే.. నిలబడేవారు అంతవీర విధేయత చూపించిన ఆయనే పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి. గతంలో రద్దయిన నల్లమడ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పడిన పుట్టపర్తి నుంచి విజయం సాధించిన పల్లె రఘునాథరెడ్డి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. పార్టీలో పల్లె విధయేత పట్ల సానుకూలతతో పాటు…. పల్లె వీర విధేయతలతో ఫిదా అయిన చంద్రబాబు కీలకమైన ఐటీ, సమాచార శాఖలను ఆయనకు అప్పగించి మంత్రిని చేశారు.
జగన్ సునామీతో….
ఇలా రెండున్నరేళ్లు చేసిన పల్లె రఘునాథరెడ్డి ఐటీలో పుంజుకోలేక పోయారనేది టీడీపీ నేతల వాదన. పైగా లోకేష్ ఆధిపత్యం ఎక్కువైందనే పల్లె రఘునాథరెడ్డి అనుచరుల వ్యాఖ్యలు కూడా వినిపించేవి. ఏదైతేనేం.. చంద్రబాబు ఐటీ ఆశలకు అనుగుణంగా పల్లె దూకుడు పెంచలేక పోయారు. ఈ నేపథ్యంలో ఆయనను పక్కన పెట్టారు. 2017 ఎన్నికల్లో పల్లె రఘునాథరెడ్డిని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టిన తర్వాత విప్ పదవి ఇచ్చారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో పల్లె తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చంద్రబాబు మాత్రం పట్టుబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు. వైఎస్ సునామీని తట్టుకుని నిలబడిన పల్లె రఘునాథరెడ్డి ఆయన కుమారుడు జగన్ సునామీ ధాటికి ఓటమిపాలయ్యారు.
అస్త్ర సన్యాసమేనా?
గత ఎన్నికల్లో దుద్దుకుంట శ్రీథర్ రెడ్డి పల్లె రఘునాథరెడ్డిపై ఘనవిజయం సాధించారు. ఇక ఇప్పుడు రాజకీయంగా పల్లె అస్త్ర సన్యాసం చేసినట్టే కనిపిస్తోంది. పైగా తాను ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్నట్టు సతీమణిని కోల్పోయిన బాధ.. మరోపక్క వయసు కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండలేక పోతున్నారు. నిజానికి పార్టీలో యాక్టివ్గా ఉండాలనే కోరిక ఆయన బ్రహ్మాండంగా ఉంది. ఇటీవల మహానాడును కూడా తన నియోజకవర్గంలో అట్టహాసంగానే నిర్వహించారు.
వచ్చే ఎన్నికల నాటికి….
కానీ, వయోవృద్ధుడు కావడం, ఇదివరకట్లా.. చురుగ్గా ఉండలేక పోతుండడంతో ఇప్పుడు ఇక్కడ టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇక పుట్టపర్తిని వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఇవ్వాలని కొందరు పార్టీ నేతలే కొత్త డిమాండ్లు తెరమీదకు తెస్తున్నారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనకు లేదా తన వారసులకు ఈ సీటు ఇవ్వాలని కొద్ది రోజులుగా చాపకింద నీరులా ఈ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. పదవి ఉన్నప్పుడు కిష్టప్పతో పాటు తనకు వ్యతిరేకులను ఎదుర్కొన్న పల్లె రఘునాథరెడ్డిఇప్పుడు ఓటమితో డీలా పడిపోయారు. దీంతో పుట్టపర్తి టీడీపీ రాజకీయ వ్యూహాంలో సొంత పార్టీ నేతల ఎత్తులను తట్టుకుని పల్లె రఘునాధరెడ్డి వచ్చే ఎన్నికల వరకు నిలబడడం కష్టంగానే కనిపిస్తోంది.