ఆ ఇద్దరి దారీ వైసీపీ వైపేనా… హాట్ టాపిక్
రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఏరోజు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో కూడా చెప్పలేం. ఐదేళ్లకోసారి జనాలు ప్రభుత్వాలను మార్చేస్తుంటే.. నాయకులు కూడా అధికారం కోసం అంతే [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఏరోజు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో కూడా చెప్పలేం. ఐదేళ్లకోసారి జనాలు ప్రభుత్వాలను మార్చేస్తుంటే.. నాయకులు కూడా అధికారం కోసం అంతే [more]
రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఏరోజు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో కూడా చెప్పలేం. ఐదేళ్లకోసారి జనాలు ప్రభుత్వాలను మార్చేస్తుంటే.. నాయకులు కూడా అధికారం కోసం అంతే సులువుగా కండువాలు మార్చేస్తున్నారు. మన నేతలకు ఇది కామన్ అయిపోయింది. ఎక్కడికక్కడ తమ అవకాశం, తమ అవసరాల కోసం.. నేతలు పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారాలు.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చాలా మంది నాయకులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు మహిళా నాయకులు… త్వరలోనే వైసీపీలో చేరతారా ? వైసీపీ పెద్దల నుంచి కూడా ఇందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా ? అంటే అవుననే తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత…?
ఇటీవల తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేసిన పనబాకలక్ష్మి, బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి.. రత్నప్రభ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికలపై కోర్టుకు కూడా వెళ్లిన ఈ ఇద్దరు.. ఇక్కడ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. కానీ, కోర్టు తీర్పు వ్యతిరేకంగావచ్చింది. ఎన్నికల ముందు వరకు వీరు ఎంత హంగామా చేశారో ? ఎన్నికల తర్వాత గప్చుప్ అయిపోయారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వీరు పార్టీలకు దూరంగా ఉంటున్నారు. అయితే.. పనబాక విషయానికి వస్తే.. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నారని.. ఆమెకు ఇప్పుడు ఆర్థిక దన్ను అవసరమని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
లీకులు అవేనట….
ఈ క్రమంలో వైసీపీ వైపు చూస్తున్నారని.. పనబాక వర్గం నుంచి లీకులు వస్తున్నాయి. వచ్చేయండి.. ఎమ్మెల్సీ ఖాయం అని తిరుపతి వైసీపీ నాయకులు.. కూడా అదే లీకులు చేస్తున్నారు. దీంతో ఆమె వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వాళ్లు కూడా పనబాకను బలవంతంగా టీడీపీలో ఉంచుతున్నారే తప్పా ఆమెకు ఇక్కడ ఉండడం ఎంత మాత్రం ఇష్టం లేదని టాక్ ? ఇక మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ.. ఆది నుంచి కూడా జగన్కు అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ ఆమె వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
అక్కడ చేరితేనే?
పనబాక వైసీపీ ఎంట్రీపై కొద్ది రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి. ఇక రత్నప్రభ విషయంలో వైసీపీ .. ఆమె లాంటి మేధావులను తమ చెంతకు చేర్చుకుని.. చంద్రబాబుకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అయితే రత్నప్రభ పార్టీ మార్పు విషయంలో కొంత సమయం పడుతుందని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడున్న పార్టీల్లో ప్రయార్టీ లేకుండా ఉండడం కంటే వైసీపీలో చేరితే ఎంతోకొంత ప్రాధాన్యం దక్కుతుందేమో ? చూడాలి.